Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభNotices to Nagarjuna : నాగార్జునకి నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఎందుకంటే..

Notices to Nagarjuna : నాగార్జునకి నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఎందుకంటే..

- Advertisement -

Notices to Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జునకి సినిమాలతో పాటు పలు బిజినెస్ లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణం, స్టూడియో, రెస్టారెంట్లు.. ఇలా పలు రంగాల్లో నాగార్జునకి బిజినెస్ లు బాగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం నాగార్జున గోవాలో కూడా ఏదో బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

దీనికోసం గోవాలోని ఓ విలేజ్ లో నిర్మాణాలు చేపట్టాడు నాగార్జున. అయితే ఈ నిర్మాణాల విషయంలో గోవా అధికారులు నాగార్జునకి నోటీసులు జారీ చేశారు. గోవాలోని మాండ్రెమ్ అనే గ్రామంలో అశ్వేవాడ అనే ఏరియాలో సర్వే నెం.211/2బి లో నాగార్జున ఇటీవల తవ్వకం, నిర్మాణ పనులు చేపట్టారు.

అయితే అది అక్రమ నిర్మాణమని, దానికోసం సరైన అనుమతులేవి తీసుకోలేదని ఆరోపిస్తూ గ్రామా పంచాయతీ అధికారులు గోవా పంచాయితీ రాజ్ చట్టం 1994 కింద నాగార్జునకి స్టాప్ వర్క్ నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువు లోపు పనులు నిలిపివేయకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే దీనిపై నాగార్జున అధికారికంగా స్పందించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News