Allu Arjun: మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ సతీసమేతంగా తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా పరిణామాలపై చిరంజీవితో చర్చించిన బన్నీ అక్కడే లంచ్ చేశారు. అనంతరం నేరుగా మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) నివాసానికి వెళ్లారు.
- Advertisement -
స్వయంగా కారు డ్రైవింగ్ చేసుకుంటున్న వెళ్లిన బన్నీ దంపతులకు నాగబాబు దంపతులు సాదర స్వాగతం పలికారు. అల్లు అర్జున్‌ను ఆత్మీయంగా హత్తుకుని ఇంటి లోపలికి తీసుకెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, కేసు వివరాలపై చర్చించారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు.