Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభGopichand Malineni : క్రాక్ 2 కచ్చితంగా ఉంటుంది.. మరింత గ్రాండ్ గా..

Gopichand Malineni : క్రాక్ 2 కచ్చితంగా ఉంటుంది.. మరింత గ్రాండ్ గా..

- Advertisement -

Gopichand Malineni : రవితేజ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా భారీ విజయం సాధించింది. ఇందులో పోలీసాఫీసర్ గా రవితేజ అదరగొట్టేశాడు. చాలా రోజుల తర్వాత రవితేజకి ఒక మంచి హిట్ వచ్చింది ఈ సినిమాతో. అప్పుడే కరోనా నుండి బయటకి వస్తూ ఆలోచిస్తూ సినిమాలు రిలీజ్ చేస్తున్న వాళ్లందరికీ కూడా క్రాక్ సినిమా బూస్ట్ ఇచ్చింది.

ప్రస్తుతం రవితేజ ధమాకా సినిమాతో రానున్నాడు. ఈ సినిమా నేడు డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రవితేజ గత రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నడూ లేనంతగా ధమాకా సినిమాని రవితేజ ముందుండి మరీ ప్రమోట్ చేస్తున్నాడు.

ధమాకా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రవితేజ ముగ్గురు యువ డైరెక్టర్స్ తో ఇంటర్వ్యూ చేశాడు. రవితేజ సినిమాలకి ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ లో పని చేసి ఆ తర్వాత రవితేజతో సినిమాలు తీసి ఆయనకి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లు రవితేజని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చర్చించారు.

గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ.. రవితేజ లేకపోతే నేను లేను. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా రవితేజ గారు పిలిస్తే వచ్చేస్తాను. ఆయన ఎప్పుడు సినిమా తీయమన్నా తీస్తాను. క్రాక్ 2 సినిమా కూడా ఉంటుంది. అది క్రాక్ కి మించి ఉంటుంది. ఆయనపై నాకు ఉన్న ప్రేమని ఇలా సినిమాల ద్వారానే తెలియచేస్తాను అని తెలిపాడు.

దీంతో క్రాక్ 2 సినిమా ఉందని చెప్పడంతో రవితేజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన తర్వాత క్రాక్ 2 ఉండొచ్చని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News