Friday, June 13, 2025
Homeచిత్ర ప్రభGopichand: గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్.. ఈసారి యోధుడి పాత్రలో

Gopichand: గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్.. ఈసారి యోధుడి పాత్రలో

మాచో హీరో గోపీచంద్‌ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోతున్నాయి. ఆయనకు సరైన కమర్షియల్ హిట్ పడి చాలా కాలం అయింది. విభిన్న కథలతో సినిమాలు తీస్తున్నా హిట్ మాత్రం పడటం లేదు. దీంతో ఈసారి తన స్టైల్ మార్చాడు. అబ్బురపరిచే టెక్నికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. #Gopichand33 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

అత‌డో యోధుడు విప్ల‌వాన్ని ర‌గిలించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఓ వీడియోను పంచుకుంది మూవీ యూనిట్. గ్లింప్స్‌లో గోపిచంద్ సరికొత్త గెటప్‌తో కనిపించడంతో పాటు సినిమాలో సాంకేతికకు ప్రాధాన్యత ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమా ఒక స్పెషల్ మిషన్ నేపథ్యంతో సాగుతుందని తెలుస్తోంది. గోపిచంద్ ఇందులో ఓ కమాండో రోల్‌లో నటిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ లెవెల్‌లో మిషన్స్, హై టెక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో కీలకంగా ఉండబోతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.

ఇక భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కనున్నఈ మూవీని శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ పై చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. కాగా ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి గ‌తంలో ఘాజీ, అంత‌రిక్షం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించాడు. ఇటీవల హిందీలోనూ IB71 చిత్రాన్ని తెరకెక్కించి సత్తా చాటాడు. దీంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News