Saturday, November 15, 2025
HomeTop StoriesGopichand : బారీ యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ‌లో గోపీచంద్ 33

Gopichand : బారీ యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ‌లో గోపీచంద్ 33

Gopichand : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. గోపీచంద్ న‌టిస్తోన్న 33వ సినిమా ఇది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీ నాలుగు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. 55 రోజుల పాటు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇంట‌ర్వెల్ బ్లాక్‌కి సంబంధించిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరో గోపిచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్.. సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

- Advertisement -

ఇప్పటికే గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. యోధుడిలా కనిపించిన గోపిచంద్ తన పాత్రలోని ఇంటెన్స్‌ని ప్రజెంట్ చేశారు. విభిన్నమైన కథలతో, సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి, ఈ చిత్రంతో భారత చరిత్రలోని ప్ర‌ముఖ‌ అధ్యాయాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూపించ‌బోతున్నారు. అద్భుతమైన ఎమోషన్స్, విజువల్ గ్రాండియ‌ర్‌తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించబోతున్నారు. గోపిచంద్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/kollywood-star-karthi-team-up-in-mega-158-movie/

యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ ఉన్న గోపీచంద్‌కు మంచి హిట్ మూవీ వ‌చ్చి చాలా కాల‌మైంది. ఆయ‌న గ‌త చిత్రం విశ్వం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్ టాక్‌నే తెచ్చుకుంది. ఇప్పుడు హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాతో సంద‌డి చేయ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో గోపీచంద్ లుక్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/pa-ranjith-counter-on-trolling/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad