Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభGouri Kishan: ఎత్తుకుంటే ఎంత బరువు ఉంటావ్? హద్దు దాటిన రిపోర్టర్!

Gouri Kishan: ఎత్తుకుంటే ఎంత బరువు ఉంటావ్? హద్దు దాటిన రిపోర్టర్!

Gouri Kishan: ఈ మధ్య కొంతమంది రిపోర్టర్ల అతి తెలివి, మరీ శ్రుతి మించిపోతోంది! టాలెంట్‌ని, సినిమాని వదిలేసి… నటీమణుల పర్సనల్ విషయాలు, బాడీ షేమింగ్ లాంటి పిచ్చి ప్రశ్నలు అడగటం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ’96’, ‘మాస్టర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ గౌరీ కిషన్ కు కూడా చెన్నై ప్రెస్ మీట్లో ఇదే ఎదురైంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘అదర్స్’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకొస్తే… అక్కడున్న ఓ రిపోర్టర్ అడ్డదిడ్డమైన ప్రశ్న వేసి, నిప్పు రాజేశాడు. “మిమ్మల్ని ఎత్తుకుంటే ఎంత బరువు ఉంటారు?” అని అడిగి… తనకి, ఆ మొత్తం మీడియా సమావేశానికీ సినిమా చూపించాడు.

- Advertisement -

ALSO READ: Kanchana 4: షూటింగ్ కంప్లీట్ కాలేదు.. అయినా 100 కోట్ల బిజినెస్

గౌరీ కిషన్‌కి ఆ మాట వినగానే ఒక్కసారిగా సీరియస్ అయ్యి! ఈయనగారికి నా బరువుతో ఏం పని? తెలుసుకుని ఏం చేస్తారు? అని అక్కడికక్కడే మైక్ పట్టుకుని ఘాటుగా ఫైర్ అయ్యింది. “నేను చేసిన సినిమా గురించి అడగండి. నా టాలెంట్ గురించి మాట్లాడండి. ఇది బాడీ షేమింగ్! నా ఇమేజ్‌ని కామెడీ చేయడం” అని గట్టిగా నిలదీసింది. కానీ, ఆ రిపోర్టర్ తగ్గేదే లే అన్నట్టు మళ్ళీ మైక్ లాక్కుని, “నేను తప్పుగా ఏం అడగలేదు, ఇది నార్మల్‌గా అడిగే ప్రశ్నే. గతంలో ఖుష్బు, సరిత లాంటి వాళ్లని కూడా అడిగారు” అంటూ సొంత డప్పు కొట్టుకున్నాడు. ఆ వాదన వింటుంటే, పాత తప్పులనే కొత్త ట్రెండ్‌గా చూపించాలనుకుంటున్నాడా అనిపించింది!

ALSO READ: Chinmayi Sripada: చిన్మ‌యిపై అస‌భ్య‌క‌ర కామెంట్స్ – సీపీ స‌జ్జ‌నార్‌కు కంప్లైంట్ ఇచ్చిన‌ సింగ‌ర్‌

ఆయన ఎంత గంభీరంగా మాట్లాడినా, గౌరీ కిషన్ మాత్రం మాస్ రిప్లైతో దుమ్ము రేపింది. “సినిమా, నా పాత్ర గురించి కాకుండా… నా బరువు గురించి తెలుసుకోవడం మీకు అంత ముఖ్యమా? ఇక్కడ ఇంత మందిలో నేనొక్కదాన్నే అమ్మాయిని. మీరు చేస్తోంది బాడీ షేమింగ్ తప్ప మరొకటి కాదు. ఇది కరెక్ట్ కాదు, మీరు మీ జర్నలిజం వృత్తికే అవమానం తెస్తున్నారు!” అంటూ కుండబద్దలు కొట్టింది. ఆ తర్వాత గౌరీ కిషన్ ధైర్యాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. ఆ రిపోర్టర్ పరువు గంగలో కలిసింది! ఈ మొత్తం రచ్చకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నటీమణుల పట్ల కొందరి మీడియా వ్యక్తుల వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్టు చూపించింది. గౌరీ స్టాండ్‌కి మాత్రం సోషల్ మీడియా నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad