Best Heroes List: 2025లో టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ ఎవరో చెప్పేసింది GROK . కేవలం స్టార్‌డమ్, ఇమేజ్‌ను బట్టి కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్‌తో యాక్టింగ్, ఎమోషన్స్ పండించడంలో వేరియేషన్స్ చూపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న వారిలో ఉత్తమ నటులు ఎవరో రివీల్ చేసింది GROK .
ప్రకాష్ రాజ్ టాప్…
ఈ లిస్ట్‌లో స్టార్స్ హీరోలను దాటేస్తూ ప్రకాష్ రాజ్ నంబర్ వన్ ప్లేస్‌లో నిలవడం గమనార్హం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రకాష్ రాజ్ బెస్ట్ యాక్టర్ అంటూ GROK వెల్లడించింది. విలన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది భాషలన్నింటిలో సినిమాలు చేస్తున్నారు ప్రకాష్ రాజ్.
Also Read – Ahmadabad plane crash: డీఎన్‌ఏ మ్యాచ్ అవ్వలేదు, మృతదేహాలు తారుమారయ్యాయి: బాధితుల కుటుంబాల ఆరోపణలు..!
ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్…
GROK బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియన్ లెవెల్‌కు చేరుకుంది. వార్ 2తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నటుడిగా ఎన్టీఆర్ ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపరుచుకునే తీరు అద్భుతమంటూ GROK ప్రశంసలు కురిపించింది.
తెలుగులో పది సినిమాలు…
బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో రాజేంద్రప్రసాద్‌కు మూడో స్థానం దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా రాజేంద్రప్రసాద్ కొనసాగుతున్నాడు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ చేతిలో పది సినిమాలు ఉన్నాయి…
నాచురల్ స్టార్ దూకుడు…
GROK లిస్ట్‌లో నాచురల్ స్టార్ నాని నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇమేజ్ పట్టింపులతో పనిలేకుండా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ హీరోగా వరుస విజయాలను అందుకుంటున్నాడు నాని. టైర్ 2 నుంచి టైర్ వన్ లిస్ట్‌లోకి అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈ ఏడాది నాని హీరోగా నటించిన హిట్ 3 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
Also Read – Dacoit: మళ్ళీ మృణాల్, శేష్ కి గాయాలు..!
అల్లు అర్జున్… మహేష్‌బాబు…
GROK బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో అల్లు అర్జున్ ఐదు, మహేష్‌బాబుకు ఆరో స్థానం దక్కింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 మూవీ 17 వందల కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకొని సత్తా చాటింది. పుష్ప 2తో నార్త్‌లో అల్లు అర్జున్ క్రేజ్ డబుల్ అయ్యింది. మరోవైపు మహేష్‌బాబు ప్రస్తుతం రాజమౌళితో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ద్వారా పాన్ ఇండియన్ లీగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.
వెంకటేష్ లాస్ట్…
GROK లిస్ట్‌లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఏడో స్థానాన్ని దక్కించుకోగా… క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్లభరణి ఎనిమిదో ప్లేస్‌లో నిలిచారు. హీరో నుంచి విలన్‌గా టర్న్ అయిన జగపతిబాబు తొమ్మిదో ప్లేస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న విక్టరీ వెంకటేష్ GROK టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో చివరి స్థానంలో నిలిచాడు. పదో స్థానాన్ని దక్కించుకున్నాడు.
నో ప్లేస్…
GROK బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో చిరంజీవి, బాలకృష్ణతో పాటు మరో సీనియర్ హీరో నాగార్జునకు స్థానం దక్కకపోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వీరితో పాటు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్‌గా కొనసాగుతోన్న ప్రభాస్, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు ఈ లిస్ట్‌లో కనిపించలేదు. GROK లిస్ట్ నమ్మశక్యంగా లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
GROK టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ ఇదే…
1. ప్రకాష్ రాజ్
2. ఎన్టీఆర్
3. రాజేంద్రప్రసాద్
4. నాని
5. అల్లు అర్జున్
6. మహేష్‌బాబు
7. బ్రహ్మానందం
8. తనికెళ్లభరణి
9. జగపతిబాబు
10. వెంకటేష్


