ఈరోజు ఎపిసోడ్‌లో హాల్‌లో కింద పడుకోలేక ప్రభావతి నానా కష్టాలు పడుతుంది. అప్పుడు బాత్‌రూమ్ అర్జెంట్‌గా వస్తుంటే ఆపుకోలేక అవస్థలు పడుతుంటే సత్యం లేచి ప్రభావతిని చూసి డైలాగ్స్ వేస్తాడు. ఇప్పుడు ఏమి చేయాలా అని ఆలోచిస్తాడు. వెళ్లి ఎవరొకరి తలుపు కొట్టు అంటే ప్రభావతి మనోజ్ రూమ్ డోర్ కొడుతుంది. అయినా తను తలుపు తీయకపోతే కాలు కాలిన పిల్లిలా తిరిగుతూ ఇప్పుడు ఏమి చేయాలి అని బయట బాత్‌రూమ్‌లోకి వెళ్లు అంటాడు సత్యం. ప్రభావతి వెళ్లను అది పాడైపోయింది అంటే తప్పదు రెండు రోజులు మీనాని అందులోనేగా స్నానం చేయమన్నావు అందుకే నీకు ఈ పరిస్థితి పట్టింది అంటాడు.
ప్రభావతి తప్పక ఇంక బయట బాత్‌రూమ్‌లోకి వెళ్లి వచ్చి ఇందుకే ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆ బాలు, మీనాని వేరే కాపురం పెట్టిద్దాం అంటున్నాను ఏం అంటారు ఏం ఆలోచించారు అని అడిగితే రేపు ఉదయానికి ఏదొక నిర్ణయం చెప్తాను పడుకో అంటాడు సత్యం. మరుసటి రోజు ఉదయాన్నే మీనా వంట చేసుకుంటుంటే ప్రభావతి వచ్చి నా మొహాన్నా కాఫీ కొట్టు అంటే మొహాన్న కొడితే బాగోదు అని వెటకారం ఆడుతుంది మీనా. బాలు బయటికి వెళ్తుంటే ప్రభావతి ఆపి మీ నాన్న వచ్చే వరకూ ఆగు మీ నాన్న నీతో మాట్లాడాలి అంటే బాలు ఆగను అని ఎందుకో చెప్పమని అందరూ అడిగితే మొత్తానికి ప్రభావతి తను అనుకున్న విషయాన్ని వేరే కాపురం గురించి చెప్తుంది అది విని ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. బాలు మాత్రం కళ్లంట నీళ్లు పెట్టుకుంటాడు, నువ్వు అంటే పర్లేదు కానీ నాన్న ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటుంది. మీనా మీరు చెప్పిన మాటలు వింటున్నాను కదా ఇంకెందుకు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అని అడుగుతుంది.
ఈలోగా సత్యం అక్కడికి వచ్చి కన్నీళ్లతో నాన్నను బ్రతిమాలుతాడు. మమ్మళ్ని అనాధలని చేస్తారా అని మీనా సత్యంను అడుగుతుంది. సత్యం మాత్రం అందరూ అర్థం చేసుకోండి ఈరోజే ఇళ్లు మారాలి ఆటో వచ్చేసింది సామాన్లు మార్చాలి అంటాడు. ఆతర్వాత లగేజీ తెచ్చి పద వెళ్దాం అని ప్రభావతిని రమ్మంటాడు. ప్రభావతి షాక్ అయ్యి ఏంటండి ఇలా చేస్తున్నారు అంటుంది. ముగ్గురు కొడుకుల్ని కని ఒక కొడుకుని బయటికి పంపడం మంచిది కాదు అందుకే మనం వెళ్లిపోదాం అంటాడు. బాలు, మీనా వెళ్లదు అని బ్రతుమాలుతాడు. ఇప్పుడెక్కడికి వెళ్తాము అంటే మా అమ్మ ఉండే పల్లెటూరికి అంటాడు. ప్రభావతి మాత్రం నేరు రాను అక్కడికి అంటుంది.బాలుని ఆపమని ప్రభావతి అంటే నాన్న వెళ్లు నాన్న తీసుకెళ్లు పేడ ఎత్తించు అంటాడు. మీనా బయటికి వెళ్లడమే మంచిది అప్పుడు మీనాకి అన్ని పనులు తప్పుతాయి అన శృతి అంటే హా మీరు అందరూ అప్పుడు మా అమ్మతోనే పనులు చేయిస్తారు అని తెలుసుకోలేకపోయింది అని బాలు అంటాడు. అప్పుడు ప్రభావతి నోరు మూసుకుని ఉంటాను అంటుంది. ఆ తర్వాత కామాక్షి ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది..