Friday, February 7, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu February 7th Episode: డబ్బులు ఇచ్చి అత్తను కంట్రోల్‌లో పెడుతున్న రోహిణి..

Gunde Ninda Gudigantalu February 7th Episode: డబ్బులు ఇచ్చి అత్తను కంట్రోల్‌లో పెడుతున్న రోహిణి..

ఈరోజు సీరియల్‌లో జ్యూస్ కోసం రోహిణి వస్తే అయ్యో అది శృతికి అని చెప్పి వెళ్లి తనకి ఇచ్చేయి అంటే మధ్యలో బాలు బాధపడకు పార్లరమ్మ నువ్వు కుడా మలేషియా నుంచి కొంత బంగారం తెస్తే ఆ గ్లాస్ నీ చేతికి తెచ్చి ఇస్తుందిలో అని పాపం రోహిణిని ఏడిపిస్తాడు. ప్రభావతికి, రోహిణికి పుల్ల పెట్టడానికి ప్రయత్నిస్తాడు. మొత్తానికి రోహిణి ఏమి మాట్లాడకుండా శృతికి జ్యూస్ పట్టుకెళ్లి ఇస్తుంది. శృతి రోహిణిని చూడకుండా మీనా ఏమో అనుకుని అవమానిస్తుంది. రోహిణి రూమ్‌లోకి వెళ్లి కోప్పడిపోతుంది. ఆ తర్వాత శృతి గోల్లు కట్ చేసుకోవడానికి కటర్ అడిగితే ఎందుకు అమ్మా రోహిణి ఉంది కదా తను చేస్తుంది అని మానిక్యూర్, పెడిక్యూర్ చేయమని ప్రభావతి రోహిణికి చెప్తుంది. మీనాకి చేయమని శృతి అంటే వద్దు అని ప్రభావతి తిట్టేస్తుంది.

- Advertisement -

ఆ తర్వాత రోహిణి తన ఫ్రెండ్‌కి డబ్బులు ఇవ్వడానికి వెళ్లి ఇంట్లో జరిగిన విషయాలు అన్నీ చెప్తుంది. తనమో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. కొత్త కోడలు దగ్గర నన్ను తక్కువ చేస్తుంది. అందుకే ఈసారి నుంచి ప్రతి నెల రూ.5 వేలు ఇద్దామనుకుంటున్నాను అప్పుడే కనీసం నాకు కొంచెం అయినా వాల్యూ ఉంటుంది అని తన ఆలోచన చెప్తుంది. డబ్బులు ఇచ్చి నా వాల్యూ పెంచుకుంటాను అంటుంది. ఆ తర్వాత రోహిణి ఇంటికి వచ్చి ప్రభావతి చేతికి రూ.5 వేలు ఇచ్చి ఇలాగే ప్రతి నెల ఇస్తాను అని బుట్టలో వేసుకుంటుంది.

ఆ మాటలకు ప్రభావతి పొంగిపోయి రోహిణిని పొగిడేస్తుంది. మళ్లీ మధ్యలో మీనాని లాగి సూటిపోటి మాటలు అంటుంది. ప్రభావతి డబ్బులు రవి గదిలో పెట్టుకోవడానికి వెళ్తే అదంతా చూస్తున్న మనోజ్ గాడు డైరెక్ట్‌గా వచ్చేసి డబ్బులు కావాలని అని అడుగుతాడు. ప్రభావతి ఇవ్వను అని ఇష్టమొచ్చినట్టు తిడుతుంది. తర్వాత బాలు ఇంటికి రాగానే మనం కుడా డబ్బులు ఇద్దాం అని మీనా చెప్తుంది. బాలు మాత్రం ఊరికే ఇవ్వదు ఏదో కారణం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తాడు. ఏదో సీక్రెట్ ఉంటుంది ఇలా ఇస్తుందంటే అని చెప్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News