Monday, January 13, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 13th Episode: ఎలాగైతేనే మొత్తానికి రవి, శృతిని ఇంటికి తీసుకొచ్చేసింది...

Gunde Ninda Gudigantalu January 13th Episode: ఎలాగైతేనే మొత్తానికి రవి, శృతిని ఇంటికి తీసుకొచ్చేసింది ప్రభావతి..

ఈరోజు ఎపిసోడ్‌లో రవి, శృతిని వాళ్ల అమ్మ ప్రభావతి ఇంట్లో తీసుకొచ్చి దింపుతుంది. కుడి కాలు లోపల రామ్మా అంటే నడవడానికి రెండు కాళ్లు కావాలి కానీ కుడి కాలుకే ఎందుకు అంత ముఖ్యం అని పిచ్చి ప్రశ్నలు వేస్తుంది. దానికి రెండు చేతులు ఉన్నా కుడి చేతితోనే ఎందుకు తింటా ఇదీ అంతే లాజిక్‌లు అడగకుండా లోపలికి రా అంటాడు రవి. లోపలికి వెళ్లాక అందరూ పలకరించుకుంటారు. శృతి వాళ్ల నాన్నను లోపలికి రమ్మని సత్యంకు చెప్తారు. సత్యం వెళ్లి శృతి వాళ్ల నాన్నను పిలిస్తే నేను రాను అంటాడు. అందరూ తొందరపడ్డారు ఏదో అయిపోయింది అంతా వదిలిలేయండి అన్నా కుడా వినడు శృతి వాళ్ల నాన్న. కనీసం మీరు అయినా లోపలికి రండి అని శృతి వాళ్ల అమ్మను పిలుస్తారు. వెంటనే రవి వాళ్ల నాన్న సత్యం కాళ్ల మీద క్షమించమని అడుగుతాడు. శృతిని కుడా కాళ్లమీద పడు అంటే మా నాన్న కాళ్లమీదే పడను అంటుంది. సారీ చెప్పడానికి కాదు ఆశీర్వాదం తీసుకోవడానికి అంటుంది మీనా. సరే అని దన్నం పెట్టుకుంటుంది శృతి.

- Advertisement -

ఈలోగా గదిలో ఉన్న బాలు తలుపు కొడతాడు. ఎవరో తలుపు కొడుతున్నారంటే, పక్కింటి వాళ్లు అని ప్రభావతి మాట మారుస్తుంది. మీనా వెళ్లి తలుపు తీస్తుంది. ఎవరు గడియ పెట్టింది అంటే తెలియదు అంటుంది మీనా. ఎవరు వచ్చారు అడిగి కిందకి వెళ్లి చూసి నువ్వెందుకు వచ్చావు అని రవి మీదకు వెళ్తుంటే మళ్లీ కొడతారా అని శృతి అడ్డుపడుతుంది. ఇందుకేనా నువ్వు తల్లిగా మారి, ప్రేమ చూపించావు అని ప్రభావతిని అంటాడు బాలు. బయటికి వెళ్లు ఇక్కడ ఉండటానికి వీళ్లేదు అని రవిని పొమ్మంటాడు. మీరు అందరూ ఇప్పుడు కలిసిపోయేలా ఉంటే అప్పుడే పెళ్లికి ఒప్పుకోవాలిగా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఎక్కడ మీ ఆయన అని శృతి వాళ్ల అమ్మని అడుగుతాడు. బయటే ఉన్నారు అని ప్రభావతి చెప్తుంది. బాలు తొందరపాటు పడకు మర్యాదగా మాట్లాడు అని బాలుని సత్యం తిడుతాడు. ఎలాగైతేనా శృతిని వాళ్ల అమ్మ ఇంట్లో అప్పచెప్తుంది.

Image Credits: Disney+hotstar

ఏదొక రోజు వాళ్లు మారుతారు ఇప్పుడెందుకు ఆవేశ పడటం అంటుంది మీనా. శృతికి బాధ్యతలు అప్పచెప్తాడు సత్యం. మీ కూతురిని మాకు అప్పచెప్పారు ఇక నుంచి మేము చూసుకుంటాం అని సత్యం అంటాడు. అలా శృతిని దేబెట్టి వాళ్లు వెళ్లిపోతారు. నా ముందు ఆ డబ్బుకన్న ఆవిడ పొగరు చూపిస్తే ఇద్దరిని బయటికి గెంటేస్తా అని బాలు బయటికి వెళ్లిపోతాడు. ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి అని ప్రభావతి, రోహిణి అనుకుంటారు. మీ బాలు అందరితో గొడవులు పెట్టుకుంటాడు మీ పెద్ద అన్నయ్య అలా కాదు అనుకుంట అంటాడు. ఈలోగా రోహిణి వచ్చి వాళ్లతో మాట్లాడుతుంది. మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తారు రవి,శృతి. కిందకి రమ్మని పిలిసి వెళ్లిపోతుంది. శృతిని పిలిచి ఇంట్లో దీపం పెట్టమని చెబుతుంది ప్రభావతి. దానికి కుడా శృతి పిచ్చిగా సమాధానం చెప్తుంది. మీనా మధ్యలో మాట్లాడుతుందని ప్రభావతి మీనాని పంపించేస్తుంది. చీర కట్టుకో అంటే డ్రెస్ బాగానే ఉంది కదా అని సమాధానం చెప్తుంది. చీర కోసం ఏదొక సాకు చెప్పి దీపం వెలిగించడానికి ట్రై చేస్తే అది వెలగదు. దానికి కుడా ప్రభావతి మీనానే తప్పుపడుతుంది. అలా శృతిని ఏమి పనులు వచ్చో రావో తెలుసుకుంటారు. ఇంతటితో ఎపిసోడి పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News