Friday, January 17, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 17th Episode: నాన్నకు హార్ట్అటాక్ రావడానికి నువ్వే కారణం.. రవి,...

Gunde Ninda Gudigantalu January 17th Episode: నాన్నకు హార్ట్అటాక్ రావడానికి నువ్వే కారణం.. రవి, మనోజ్‌లు కలిసి బాలుపై నిందలు..

ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి,శృతిని రెడీ చేయడం పూర్తిచేస్తుంది. మీనా వచ్చి ఎంత బాగున్నావో శృతి అంటుంది. అచ్చం పెళ్లికూతురులా ఉన్నావు అని చీర మడత పెడిందని సర్దుతుంటే నువ్వు ఇక్కడ అమి చేస్తున్నావు వెళ్లి పాలు కాయమన్నాను కాచావా వెళ్లి ఈ పాల సంగతి చూడు అంటుంది ప్రభావతి. మీనాకే ఎందుకు అన్ని పనులు చెప్తున్నారు తను ఒక్కర్దే ఎలా చేస్తుంది అంటే తను బాగా చేస్తుంది అందుకే తనకు చెప్తున్నాను అంటుంది ప్రభావతి. శృతిని నగలు వేసుకోలేదే మీ నాన్న ఏమి కొనలేదా అంటే చాలా కొన్నారు కానీ నీకు ఇష్టం లేదు వేసుకోవడం అంటుంది శృతి. ఉంటే చాలు ఎప్పుడో కప్పుడు ఇక్కడికి వస్తాయిలే అని మనసులో అనుకుంటుంది. తర్వాత పాలు కాస్తున్న మీనా దగ్గరికి ప్రభావతి వచ్చి తొందరగా చేయమని తిట్టి వెళ్లిపోతుంది.

- Advertisement -

మీనా ఫ్రిడ్జ్‌లో నుంచి ఫ్రూట్స్ తీయడానికి వెళ్తే ఈలోపు బాలు వంట గదిలోకి వచ్చి అక్కడ ఉన్న పాలు తనకోసం పెట్టిందనుకుని తీసుకుని మొత్తం పాలు తాగేస్తాడు. కిందకి వచ్చిన బాలుని పైకి తీసుకుపోవే మీనా అంటుంది ప్రభ. పైకి వెళ్దాం రండి అంటే నాకు గాళ్లో తేలినట్టు ఉంది అంటాడు మందు కొట్టారా అంటే కాదు పాలు కొట్టాను అంటాడు. వంట గదిలో ఉన్న పాలు తాగేసా అని చెప్తాడు. శోభనం గదిలోకి పట్టుకెళ్లాల్సిన పాలు అవి అవెందుకు తాగావు అని అడుగుతుంది. ఒక్క మంచి పని కుడా చేయవు అంటుంది. బాలు మేడ మీదకి వెళ్లాక ఇప్పుడెలా అని అందరూ అనుకుని మనోజ్‌ని బయటికి వెళ్లి మళ్లీ బాదం, జీడిపప్పు అన్నీ తెమ్మంటే తేనని లోపలికి వెళ్లిపోతాడు.

పైన పడుకున్న బాలు దగ్గరికి రవి వెళ్లి మాట్లాడానికి పిలుస్తాడు. ఇక్కడి నుంచి కుడా పొమ్మంటావా అని అంటాడు. నా మీద ఎందుకు అంత కోపం నేనమి తప్పు చేసాను అని అంటాడు. మా పరువు తీసావు, వద్దు అని చెప్పినా పెళ్లి చేసుకున్నావు అది తప్పు కాదా అంటాడు. నేను పెళ్లి చేసుకోకపోతే శృతి చచ్చిపోతానంది అని చెప్తాడు. అందుకు ఇంట్లో వాళ్లు చనిపోయినా పర్లేదు అని బయటికి పోతావా అంటాడు రవి. బాలు ఇంకా తిడుతుంటే రవి సర్ధిచెప్పడానికి ట్రై చేస్తాడు. పాత రోజులు గుర్తుచేయడానికి ప్రయత్నిస్తాడు. సినిమా డైలాగ్స్ చెప్పకు, ఇవి నీ పెళ్లాం రాసి ఇచ్చిందా నీ సొంత తెలివితేటలా అంటాడు బాలు. నాన్నను పోలీస్ స్టేషన్‌లో పెట్టించావు. చాలా రోజులు కోల్పేలేకపోయాడు. నాన్నకు మళ్లీ ఏమైనా అయితే నేను అసలు ఊరుకోను అంటాడు రవి.

నాన్నకు హార్ట్ ఎటాక్ రావడానికి కారణం నువ్వు అయితే నన్ను అంటున్నావు ఏంటి అంటాడు రవి. నువ్వు తాగి గొడవలు పెట్టుకుంటుంటే నాన్న తట్టుకోలేక ఆ పరిస్థితి వచ్చింది. బాలు రవిపై చేయి ఎత్తితే మధ్యలో మనోజ్ వచ్చి ఆపుతాడు. మీ మూర్కత్వం వల్లే నాన్నకు అలా జరిగింది అని రవికి మనోజ్ సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఆ రోజు ఇంట్లో అంత పెద్ద గొడవ చేయడం వల్లే నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది అంటాడు మనోజ్. మేము అందరం కలిసి రివర్స్ అయితే ఏమి చేస్తావు అని రవికి ధైర్యం చెప్తాడు. బాలు ఏమో చప్పట్లు కొట్టి మీరేమైనా గొప్పవాళ్లు ఆ అని నిలదీస్తాడు. వీడితో మాటలు వేస్ట్ పద కిందకి వెళ్దాం అని తీసుకెళ్లిపోతాడు మనోజ్. ఈరోజు నీకు ఫస్ట్‌నైట్ లా జరుగుతుందో చూస్తాను అంటాడు బాలు. ప్రభావతి గదికి వెళ్లి చూసే సరికి గదికి తాళం వేసి ఉంటుంది. బాలు ఏ చేసి ఉంటాడు ఇప్పుడెలా అని కంగారు పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News