Friday, January 31, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 28th Episode: తప్పు అంతా మీదే అంకుల్.. శృతి మాటలకు...

Gunde Ninda Gudigantalu January 28th Episode: తప్పు అంతా మీదే అంకుల్.. శృతి మాటలకు ఇళ్లంతా షాక్..

ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ మేడ మీదకి వెళ్లి వ్యాయామం చేస్తుంటే అక్కడ టెంట్‌ను చూసి దొంగలోమో అనకుని ఇంట్లో వాళ్లని పిలుస్తాడు. టెంట్‌లో శృతి,రవి శుభ్రంగా పడుకుని లేస్తారు. అక్కడ ప్రభావతి ఏమో రూమ్‌లో వాళ్లు లేకపోవడం చూసి ఎక్కడికో వెళ్లారు అనుకుంటుంది. ఈలోపు మనోజ్ కిందకి వచ్చి పైన టెంట్ ఏదో ఉంది అంటాడు. మొత్తం అందరూ కలిసి మేడ మీదకి వెళ్తారు. ఏదో సీబీఐ ఆఫీసర్స్ లాగ బిల్డ్‌అప్ ఇస్తారు. వెళ్లి చూడటానికి ఓ భయపడిపోతారు. అప్పుడు మీనా వెళ్తాను అంటే ప్రభావతి ఆపి ఒక్కకరూ కాదు అందరం కలిసి వెళ్దాం అంటుంది.

- Advertisement -

లోపల ఎవరు ఉన్నారు అ గట్టిగా అరిస్తే శృతి, రవి బయటికి వస్తారు ఈలోపు వీళ్లు వాళ్లని కొట్టబోయి ఆగిపోతారు. కిందకి వచ్చా సత్యం మీరు పైకి ఎందుకు వెళ్లారు అంటే నిన్న బాలు రూమ్ ఇవ్వనంటే అందులో పడుకోవడానికి ఉంటుందని కొన్నాను అంటుంది శృతి. అయినా రూమ్ ఇచ్చాము కదా అంటే ఎలాగో కొన్నాము కదా అని వెళ్లి పడుకున్నాము అంటుంది శృతి. సత్యం గట్టిగా రవిని తిట్టి కుటుంబంలో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో అంటాడు.

మరోవైపు శృతి వాళ్ల అమ్మ శృతి ఏంటి అసలు ఫోన్ చేయలేదు ఏంటి అని ఫోన్ చేసి మాట్లాడుతుంది. రూమ్ గురించి రెండు రోజుల నుంచి జరిగిన విషయాలు అన్నీ చెప్తుంది. కోపంతో వాళ్ల అమ్మ ఫోన్ పెట్టేసి డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తుంది. శృతిని ఇటికి వచ్చేయ్ అంటుంది. ముందు కుర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే మెట్ల మీద కూర్చోవాలా, మేడ మీద కూర్చోవాలా అని ఈ సోఫాలో మనఇద్దరం కూర్చుంటే అది చాపలా మారిపోతుంది అంటుంది. ఎందుకు వచ్చేయమంటున్నారు అంటే కొత్తగాపెళ్లి అయిన వాళ్లకి కనీసం రూమ్ ఇవ్వలేకపోయారు అంటుంది.

ఎవరినీ మాట్లాడనీయకుండా ఆవిడే ఓ వాగేస్తుంది.అప్పుడు శృతి ఆపి పైన పడుకోడానికి నేనే వెళ్లాను అంటుంది. రూమ్ ఉంటే నువ్వు ఎందుకు వెళ్తావు అని వరుసగా మాట్లాడుతుంది. ఈలోగా బాలు ఇంటికి వచ్చి ఆ మాటలు వింటాడు. ముగురు కొడుకులను కంటే మూడు రూమ్‌లు కట్టాలా మరి మీ ఇంట్లో పది రూమ్‌లు ఉన్నాయి గా మరి పది మంది పిల్లల్ని కనలేదే అని అడుగుతాడు. ఆ మాటలకు ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. అప్పుడు మీనా మేము మాట్లాడుకుంటున్నాము కదా మీరు ఎందుకు మధ్యలోకి వస్తారు బయటికి వెళ్లండి అంటుంది. దానికి బాలు ఇది నా ఇళ్లు నేను ఎందుకు వెళ్తాను వెళ్లాల్సిన వాళ్లు వెళతారు అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News