ఈరోజు ఎపిసోడ్‌లో శృతి వాళ్ల అమ్మ శృతిని ఇంటికి వచ్చేయమని గొడవ చేస్తుంటే బాలు వచ్చి తగులుకుంటాడు. లోన్ కోసం మా నాన్న ఏ ఎదవ కాళ్లు పట్టుకోలేదు అని సీరియస్ అవుతాడు. మీ నాన్న గురించి ఎంత ఇన్‌సల్ట్ చేసి మాట్లాడుతున్నాడు వెదవ అని తిడుతున్నాడు మరి వీడిని పచ్చి రౌడీ వెదవ అనాలా అంటుంది శృతి వాళ్ల అమ్మ.
ఆ మాటలకూ శోభన ఇలాంటి ఇంట్లో నా కూతురును ఉండనివ్వను నీ మొగుడును తీసుకురా అని శృతిని అంటుంది. దానికి బాలు హా పోరా దరిద్రం పోతుంది అంటాడు. ఈలోగా సత్యం వచ్చి ఏమైంది అంటే నా కూతురిని తీసుకెళ్తున్నా అంటే మంచిది ఎప్పుడు తీసుకొస్తారు అని సత్యం అడుగుతాడు. దానికి మళ్లీ తీసుకురాను, అంటే సత్యం అడ్డుపడి, మేము బాగా చేసుకుంటున్నాం ప్రభావతి బాగా చూసుకుంటుంది అంటాడు. అయితే వాళ్లకి రూమ్ ఇస్తే ఆ టెంట్‌లో ఎందుకు పడుకుంటుంది అని అడుగుతుంది.
శృతి ఏ చెప్పింది రూమ్ ఇవ్వలేదని పైన పడుకున్నాము అని చెప్తుంది. రూమ్ ఇవ్వక పడుకోలేదు, మాకు ఇష్టం అయిందని టెంట్‌లో పడుకున్నాము అని శృతి చెప్తుంది. దాంతో శోభన షాక్ అయ్యి ఎలా అయినా సరే ఇలా రౌడీలు ఉన్న ఇంట్లో నిన్ను ఉంచను అని శృతిని తీసుకెళ్లాలని చూస్తుంది. బాలు మాట్లాడిన మాటలకు సత్యం శోభనకు సారీ చెప్పమంటాడు కానీ బాలు చెప్పకుండా వెళ్లిపోతాడు. అంతా సర్దుకున్నాక, నేనేం తప్పు చేయలేదు నేను ఎందుకు సారీ చెప్పాలి అని ఫ్రెండ్‌తో చెప్పుకుంటాడు. ఇంట్లో జరిగిన విషయాలు అని రాజేష్‌తో చెప్తాడు.
తప్పుగా మాట్లాడింది ఆవిడ నేను ఎందుకు సారీ చెప్పాలి అంటాడు. దానికి ఆ ఫ్రెండ్ ఇంతకీ చెప్పావా ఏంటి అని అడుగుతాడు. సర్లే ఇవన్నీ వదిలేయి, తాగుదాం అని బార్ కు బయల్దేరుతారు. దారిలో బాలు వాళ్లిద్ధరి ఫ్రెండ్స్ బుర్ర శుభ్రంగా తినేస్తాడు. వాళ్లేమే బాలు గోల భరించలేక ఆపరా బాబు నీకు దణ్ణం పెడుతా అని ఆపుతారు. అక్కడ బార్‌లో తాగుతూ సోది వేసుకుంటారు. ఎవడో తాగుబోతు వచ్చి మాట మాటకు సారీ చెప్తుంటే అది విని బాలు వాడి మీద సీరియస్ అవుతూ గొడవ పెట్టుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది..