GV Prakash and Saindhavi: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నారు. 12 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ప్రకాష్ కుమార్, సైంధవిలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది.
మార్చిలో పిటీషన్…
ఈ ఏడాది మార్చిలో విడాకులు కోరుతూ ఇద్దరూ కోర్టు మెట్లు ఎక్కారు. పిటీషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కోర్టుతో పాటు పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిసింది. మనస్పర్థలతోనే ప్రకాష్ కుమార్, సైంధవి విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read- OG Movie: 250 కోట్ల క్లబ్‌లోకి ఓజీ – బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
లవ్ మ్యారేజ్…
జీవి ప్రకాష్ కుమార్‌కు సైంధవి చిన్ననాటి స్నేహితురాలు. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి 2013లో పెళ్లిచేసుకున్నారు. 12 ఏళ్ల పాటు సజావుగా వీరి కాపురం సాగింది. విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ విడిపోయారు. ప్రకాష్ కుమార్, సైంధవిలకు ఓ కూతురు ఉంది. తల్లి సైంధవి సంరక్షణలోనే కుమార్తె ఉండాలని కోర్టు వెల్లడించింది.
అల్లు అర్జున్ గంగోత్రితో…
అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రితో సింగర్‌గా సైంధవి జర్నీ మొదలైంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడింది. కోలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నది. జీవీ ప్రకాష్ కుమార్ సినిమాల్లో సైంధవి పాడిన చాలా పాటలు సూపర్ హిట్టయ్యాయి.
మ్యూజిక్ డైరెక్టర్‌గా…
మరోవైపు ప్రస్తుతం జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమిళంతో పాటు తెలుగులో పలు సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది తెలుగులో రాబిన్‌హుడ్, తమిళంaలో గుడ్‌బ్యాడ్ అగ్లీ, కింగ్‌స్టన్, వనంగాన్, వీర ధీర సూరన్ 2 సినిమాలకు మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఇడ్లీ కడై, పరాశక్తి, సూర్య- వెంకీ అట్లూరి మూవీతో పాటు మరో ఆరు సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా హీరోగా కోలీవుడ్‌లో రాణిస్తున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. ఈ ఏడాది కింగ్‌స్టన్, బ్లాక్‌మెయిల్ సినిమాల్లో హీరోగా నటించాడు. మరో నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.


