Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభHaiwaan : మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో సర్‌ప్రైజ్.. ఒప్పం రీమేక్‌లో అక్షయ్‌-సైఫ్‌ జోడీ!

Haiwaan : మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో సర్‌ప్రైజ్.. ఒప్పం రీమేక్‌లో అక్షయ్‌-సైఫ్‌ జోడీ!

Haiwaan : బాలీవుడ్‌ స్టార్స్ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్న కొత్త చిత్రం ‘హైవాన్’ లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న ఈ సినిమా, 2016లో వచ్చిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఒప్పం’ కు రీమేక్‌. ఒరిజినల్‌లో మోహన్‌లాల్ హీరోగా నటించగా, రీమేక్‌లో ఆయన సర్‌ప్రైజ్ క్యారెక్టర్‌లో ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ విషయాన్ని ప్రియదర్శన్ స్వయంగా వెల్లడించారు.

- Advertisement -

ALSO READ: Mass Jathara: ర‌వితేజ ‘మాస్ జాత‌ర‌’ నిర్మాత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు.. రిలీజ్ ఎప్పుడంటే!

‘హైవాన్’ శనివారం కొచ్చిలో షూటింగ్ ప్రారంభమైంది. స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లలో మార్పులతో ఈ చిత్రం హిందీ ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందుతోంది. అక్షయ్ కుమార్‌ను ‘బాలీవుడ్ మోహన్‌లాల్’గా అభివర్ణిస్తూ, అతనితో పనిచేయడం సౌకర్యంగా ఉంటుందని ప్రియదర్శన్ అన్నారు. ఈ చిత్రంలో శ్రియా పిల్‌గావ్‌కర్, సాయామి ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముంబైలో షూటింగ్‌కు అనుమతి లభించకపోవడంతో కొచ్చిలో చిత్రీకరణ మొదలైంది. ఒప్పం సినిమా షూటింగ్ జరిగిన అదే ప్రాంతంలో ‘హైవాన్’ తీయడం ఆనందంగా ఉందని దర్శకుడు చెప్పారు.

‘ఒప్పం’లో మోహన్‌లాల్ గుడ్డి వ్యక్తిగా, సముద్రఖని విలన్‌గా నటించారు. ఈ రీమేక్‌లో సైఫ్ అలీ ఖాన్ గుడ్డి పాత్రలో, అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్, సైఫ్ గతంలో ‘మైన్ ఖిలాడీ తూ అనారీ’, ‘తాషన్’ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియదర్శన్ తన 100వ చిత్రాన్ని మోహన్‌లాల్‌తో 2026లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. KVN ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ థ్రిల్లర్ సినిమా బాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని అంచనా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad