Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభHamsa Nandini : క్యాన్సర్‌ను జ‌యించిన న‌టి.. ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Hamsa Nandini : క్యాన్సర్‌ను జ‌యించిన న‌టి.. ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Hamsa Nandini : టాలీవుడ్‌లో ‘అనుమానాస్ప‌దం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హంసా నందిని. హీరోయిన్‌గా ప‌లు చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికి అవి అంత‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. దీంతో ప్ర‌త్యేక పాత్ర‌లు, స్పెష‌ల్ సాంగ్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ‘అత్తారింటికి దారేది’, ‘మిర్చి’ సినిమాలో చేసిన ఐటెం సాంగ్స్ హంసా నందినికి మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే.. గ‌త డిసెంబ‌ర్‌లో తాను క్యాన్స‌ర్ బారిన ప‌డిన‌ట్లు హంసా నందిని చెప్పింది. మ‌హ‌మ్మ‌రితో పోరాడి విజ‌యం సాధించి తిరిగి వ‌స్తాన‌ని వెల్ల‌డించింది. ఇక తాను చెప్పిన‌ట్లునే క్యాన్స‌ర్‌ను జ‌యించిన‌ట్లు తాజాగా శుభ‌వార్త చెప్పింది. 16 సార్లు కీమోథెర‌ఫి చికిత్స త‌రువాత పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెటింట్ట వైర‌ల్‌గా మారాయి.

“ఇది నాకు పున‌ర్జ‌న్మ‌ లాంటిది. సెట్‌లో అడుగుపెట్టిన ఈ క్ష‌ణం నేను పొందిన అనుభూతి వేరు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో పుట్టిన రోజులు చేసుకున్న‌ప్ప‌టికీ ఈ పుట్టిన రోజు ఎంతో ప్ర‌త్యేకం. నా తోటి న‌టీన‌టులు, మూవీ యూనిట్‌తో క‌లిసి పుట్టిన రోజు చేసుకున్నా. మీ అంద‌రి ప్రేమ‌, అభిమానం వ‌ల్లే నేను కోలుకోగ‌లిగాను. ఐ యామ్ బ్యాక్” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో హంసా నందిని రాసుకొచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News