Hansika: హీరోయిన్ హన్సిక భర్త నుంచి విడాకులు తీసుకోనుందంటూ కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. మనస్పర్థల కారణంగా చాలా రోజులుగా భర్త సోహైల్ ఖతురియాకు హన్సిక దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
పెళ్లి ఫొటోలు డిలీట్…
తాజాగా ఈ విడాకుల రూమర్స్‌కు బలాన్ని చేకూరుస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేసింది హన్సిక. ఆమె చేసిన పనితో మరోసారి విడాకుల వార్త హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి ఫొటోలను డిలీట్ చేసి భర్త నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా హన్సిక కన్ఫామ్ చేసిందని నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే హన్సిక గత రెండు వారాలుగా ఒక్క పోస్ట్ చేయలేదు. విడాకుల వ్యవహారం కారణంగానే ఆమె సైలెంట్‌గా మారిందని అంటున్నారు. గత కొన్నాళ్లుగా సోహైల్, హన్సిక విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. భర్త ఇంటికి దూరమైన హన్సిక… తల్లితో కలిసి ఉంటుందని చెబుతోన్నారు.
Also Read – Bride Suicide : స్వీట్ల కోసం వెళ్లిన వరుడు.. గదిలో నవవధువు ఉరికి వేలాడుతూ
లవ్ షాదీ డ్రామా…
2022 డిసెంబర్‌లో సోహైల్ ఖతురియాను పెళ్లిచేసుకుంది హన్సిక. జైపూర్‌లోని ముందోట ఫోర్ట్‌లో వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. హన్సిక, సోహైల్ పెళ్లి వేడుక లవ్ షాదీ డ్రామా అనే డాక్యుమెంటరీ సిరీస్‌గా జియో హాట్ స్టార్‌లో రిలీజైంది. కాగా సోహైల్‌కు ఇది రెండో వివాహం. 2016లో రింకీ బజాజ్‌ను పెళ్లిచేసుకున్నాడు సోహైల్. మూడేళ్లకే ఈ జంట విడాకులు తీసుకున్నారు. సోహైల్ మొదటి పెళ్లికి హన్సిక గెస్ట్‌గా హాజరైంది.
దేశముదురు, కందిరీగ…
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందింది హన్సిక. అల్లు అర్జున్ దేశముదురుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కందిరీగ, దేనికైనా రెడీ, పవర్‌తో వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. తమిళంలో సూర్య,దళపతి విజయ్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. పరాజయాలు హన్సిక కెరీర్‌ను దెబ్బతీశాయి. యంగ్ హీరోయిన్ల జోరుతో కమర్షియల్ సినిమాలకు దూరమైన హన్సిక కొన్నాళ్లుగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం గాంధారి అనే హారర్ మూవీ చేస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Also Read – Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..ఇలా చేశారంటే సంపదలన్ని మీవే!


