Hansika Motwani: సినిమా సెలిబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామన్‌గా మారిపోయింది. ధనుష్, జయం రవి, ఆమిర్‌ఖాన్, ఏఆర్ రెహమాన్, సమంతతో పాటు పలువురు స్టార్స్ మనస్పర్థల కారణంగా వైవాహిక బంధానికి ముగింపు పలికారు. హీరోయిన్ హన్సిక కూడా భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్ల నడుమ హన్సిక తన ఇంటి పేరును మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు హన్సిక మెత్వానీ (Hansika Motwani) పేరుతో సోషల్ మీడియాలో కొనసాగిన హన్సిక.. ఇంటి పేరులో కొత్తగా ఎన్ అక్షరాన్ని యాడ్ చేసింది. హన్సిక మెత్వాన్నీగా (Hansika Motwanni) మార్చుకుంది.
ఈ పేరు మార్పుతో మరోసారి విడాకుల రూమర్స్ తెరపైకి వచ్చాయి. హన్సిక భర్త నుంచి విడిపోవడం నిజమేనని అంటున్నారు. అందుకే ఇంటి పేరును హన్సిక మార్చుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. మరికొందరు నెటిజన్లు మాత్రం విడాకుల వార్తలను కొట్టిపడేస్తున్నారు. పేరు మార్పు వేనుక గల కారణాలను హన్సిక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివీల్ చేసింది. తల్లి సూచన మేరకు తన పేరును మార్చుకున్నట్లు చెప్పింది. ఇష్టం లేకపోయినా అమ్మ మాట కాదనలేక ఇలా చేసినట్లు తెలిపింది.
Also Read – Plane Crashes: చూస్తుండగానే కుప్పకూలిన విమానం.. ఎగిసిపడిన మంటలు, ఇద్దరు మృతి
హన్సిక హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఆమె హీరోయిన్‌గా నటించిన తెలుగు, తమిళ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఈ డిజాస్టర్స్ కారణంగా ఆఫర్లు తగ్గాయి. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురవ్వడంతోనే న్యూమరాలజీ ప్రకారం హన్సిక పేరును మార్చుకుందని అంటున్నారు.
బిజినెస్‌మెన్ సొహైల్ ఖతురియాను ప్రేమించిన హన్సిక 2022లో అతడిని పెళ్లిచేసుకుంది. మూడేళ్లు కాకముందే అభిప్రాయభేదాల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు సమాచారం. కొన్ని రోజులుగా భర్తకు దూరంగా తల్లితో కలిసి హన్సిక ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విడాకుల పుకార్లపై ఇప్పటివరకు హన్సిక మాత్రం పెదవి విప్పలేదు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది హన్సిక. తొలి సినిమాతోనే పెద్ద హిట్టు అందుకుంది. ఆ తర్వాత బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ, పవర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కోలీవుడ్‌లో అగ్ర హీరోలతో సినిమాలు చేసిన హన్సిక నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించింది. ప్రస్తుతం హన్సిక తమిళంలో మూడు, హిందీలో ఓ సినిమా చేస్తోంది.
Also Read – Accident: ఒకే జిల్లాలో రెండు చోట్ల ప్రమాదాలు.. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి


