పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. అయితే గతంలో ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఖాళీ సమయాల్లో షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ‘హరిహర వీరమల్లు'(Harihara Veeramallu) సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే అమరావతిలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పవన్ తన పాత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ మూవీ మేజర్ పార్ట్‌ని ఇప్పటికే ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వం నుంచి తప్పించుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగిలిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీలో ఓ పాటను స్వయంగా పవన్ ఆలపించారని మేకర్స్ ప్రకటించారు. మూవీలో ఓ సందర్భానుసారం పవన్ గొంతుతో పాడాల్సిన సాంగ్ ఉంటుందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారట. దీంతో అభిమానులకు డబుల్ బొనాంజా దొరకనుంది.
ఇక పవన్ సినిమాల విషయానికొస్తే సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా షూటింగ్‌లో కూడా త్వరలోనే పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80శాతం పూర్తి అయింది. పవన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే ఈ సన్నివేశాలు కూడా తెరకెక్కించనున్నారు. అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా పవర్ స్టార్ నటిస్తున్నారు. ఇవే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ మూవీకి కమిట్ అయ్యారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ సినిమాలన్ని షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కానున్నాయి.