Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభHHVM Ticket Rates: ఏపీలో పెరిగిన ‘హరిహర వీరమల్లు’ టికెట్ రేట్స్

HHVM Ticket Rates: ఏపీలో పెరిగిన ‘హరిహర వీరమల్లు’ టికెట్ రేట్స్

Pawan Kalyan – Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు’ మూవీ జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. జూలై 21 (సోమవారం) మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. భారీ అంచనాలతో విడుదలకు మూవీ సిద్ధమవుతోంది. అయితే వారం పది రోజులుగా ఈ మూవీ టికెట్ రేట్స్ పెంపుదల ఎలా ఉంటుందనే దానిపై చిన్నపాటి చర్చ నడుస్తూనే ఉంది. అందుకు కారణం, పవన్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌తో సినిమాను నిర్మించారు. సినీ సర్కిల్స్‌ టాక్ మేరకు హరి హర వీరమల్లు బడ్జెట్ మూడు వందల కోట్లు దాటింది.

- Advertisement -

పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాకు జ్యోతికృష్ణ (Jyothi Krishna) దర్శకుడు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో టికెట్ రేట్స్‌ను ఏపీలో పెంచుతున్నట్లు ప్రభుత్వం నుంచి జీవో జారీ అయ్యింది. నిర్మాతలు రెండు వారాల వరకు మూవీ టికెట్ రేట్స్‌ను పెంచాలని రిక్వెస్ట్ పెట్టుకోగా, ప్రభుత్వం మాత్రం పది రోజులు మాత్రమే ఈ వెసులుబాటుని కల్పించింది. ఏపీలో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటుందని నిర్మాత ప్రకటించారు. ఈ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ జి.ఎస్టీతో కలిపి రూ.600గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక లోయర్ క్లాస్ టికెట్ రేట్స్ రూ.100 వరకు పెంచుకోవచ్చు. ఇక అప్పర్ క్లాస్ టికెట్ రేట్స్‌ను రూ.150 వరకు పెంచుకోవచ్చునని, మల్టీప్లెక్స్ విషయానికి వస్తే వాటి టికెట్ ధరను రూ.200 వరకు పెంచుకోవచ్చునని ప్రభుత్వం తెలియజేసింది.

HHVM-File
HHVM..

Also Read – గరీబ్ రథ్ లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

2020లో ప్రారంభమైన హరి హర వీరమల్లు అనేక అడ్డంకులను దాటుకుని రిలీజ్‌కు సిద్దమైంది. ఇందులో ఔరంగజేబుని ఎదుర్కొనే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ మెప్పించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించాడు. మెగా సూర్య బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం సమర్పణలో దివాకర్ మూవీని నిర్మించారు.

హరి హర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. ఇందులో మొదటి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌గా జూలై 24న రానుంది. దీని తర్వాత మరో రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ (OG Release date) కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) వచ్చే ఏడాది రానుంది. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమా కెరీర్ గురించి ఇప్పుడేమీ చెప్పలేమంటున్నాయి సినీ వర్గాలు.

Also Read – మాల్దీవులకు ప్రధాని మోదీ.. ఈసారి ఏం జరుగుతుందో..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad