Pawan Kalyan Songs: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ ఎపిక్ హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకుడిగా మొదలుపెట్టిన ఈ సినిమాను ఆ తర్వాత జ్యోతికృష్ణ కంప్లీట్ చేశాడు. అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, నోరా ఫతేహీ, నర్గీస్ ఫక్రీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈనెల 24న హరి హర వీరమల్లు అత్యంత భారీ స్థాయిలో 5 భాషలలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఊహించని విధంగా అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. ఆయన కెరీర్‌లో వీరమల్లు మొదటి పాన్ ఇండియా సినిమా. అంతేకాదు, మొదటి పీరియాడికల్ మూవీ కూడా. అందుకే, ఈ సినిమా విడుదల కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఓ సినిమా వాయిదా పడితే ఇక దానిమీద ఆసక్తి తగ్గిపోతుంది.
Also Read – Poha Or Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్?
కానీ, ఇన్నిసార్లు పోస్ట్‌పోన్ ..నాలుగేళ్ళ సుదీర్ఘ సమయం..అయినా ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి, అంచనాలు పెరిగాయో తప్ప తగ్గింది లేదు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే మ్యూజికల్‌గా పెద్ద హిట్. కానీ, వీరమల్లు సినిమా పాటల విషయంలో ఎందుకో ఆ బజ్ క్రియేట్ అవడం లేదు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు జనాలకి అంతగా గుర్తు లేదనేది నిర్మొహమాటంగా చెప్పాల్సిన మాట. ఎందుకో కీరవాణి, రాజమౌళి సినిమా మీద పెట్టిన ప్రత్యేకమైన శ్రద్ద వీరమల్లు మీద పెట్టలేదని అంటున్నారు.
బాహుబలి సిరీస్, త్రిపులార్ సినిమాలకి సాంగ్స్ పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. కానీ, వీరమల్లు మ్యూజికల్‌గా కీరవాణి నిరాశపరిచారనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఇక కీలకమైన అంశం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. రాజమౌళి సినిమాలకి మించి హరిహర వీరమల్లు కి ఇస్తారా అనేది చాలామందిలో కలుగుతున్న సందేహం. నిజంగా వీరమల్లు సినిమా విషయంలో ఎం ఎం కీరవాణి పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదేమో అనే విషయం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తే గానీ తెలియదు. కీరవాణి గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకి పనిచేయలేదు. ఇదే మొదటిసారి..చూడాలి మరి వీరి కాంబోకి ఎలాంటి పేరొస్తుందో.
Also Read – Amarnath yatra: అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకంటే?


