Jyothi Krishna Telugu Movies: హరిహర వీరమల్లు మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్‌కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఓ రోజు ముందుగానే హరిహర వీరమల్లు ప్రభంజనం మొదలు కాబోతుంది. వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జరుగుతోన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ గత సినిమాల రికార్డులను హరిహర వీరమల్లు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇద్దరు దర్శకులు…
హిస్టారికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీకి క్రిష్‌తో పాటు ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. షూటింగ్ డిలే కారణంగా క్రిష్ సినిమా మధ్యలో నుంచి తప్పుకోవడంతో ఏఎమ్ జ్యోతికృష్ణ ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇద్దరు దర్శకుల కలయికలో ఓ సినిమా రూపొందడం ఇదే ఫస్ట్ టైమ్. క్రిష్ విషయంలో ఎలాంటి డౌట్ లేకపోయినా జ్యోతికృష్ణ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా హరిహర వీరమల్లు రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Also Read – Akhanda 2 Shooting: ‘అఖండ 2’లో బాలయ్య యాక్షన్ ధమాకా! లీక్డ్ వీడియో వైరల్
ఐదు సినిమాలు…
హరిహర వీరమల్లు నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడిగా డైరెక్టర్ జ్యోతికృష్ణ 2003లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 22 ఏళ్ల సినీ కెరీర్‌లో స్టార్ హీరోతో జ్యోతికృష్ణ చేసిన ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు కావడం గమనార్హం. డైరెక్టర్‌గా ఇప్పటివరకు తెలుగు మూడు, తమిళంలో రెండు సినిమాలు చేశాడు జ్యోతికృష్ణ. ఇవన్నీ డిజాస్టర్లుగానే నిలిచాయి.
నీ మనసు నాకు తెలుసుతో ఎంట్రీ…
తరుణ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన నీ మనసు నాకు తెలుసు మూవీతో డైరెక్టర్‌గా మారాడు జ్యోతికృష్ణ. మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాతోనే త్రిష టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏఆర్ రెహమాన్ పాటలు పెద్ద హిట్టయినా కథలో ఆసక్తి లోపించడంతో నీ మనసు నాకు తెలుసు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. ఆ తర్వాత తమిళంలో కేడీ, ఊ లాలాలా అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు జ్యోతికృష్ణ. ఈ రెండు సినిమాలు కూడా జ్యోతికృష్ణకు నిరాశనే మిగిల్చాయి.
గోపీచంద్ ఆక్సిజన్…
చాలా కాలం పాటు మెగాఫోన్‌కు దూరంగా ఉన్న జ్యోతికృష్ణ గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు జ్యోతికృష్ణ. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఆక్సిజన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
Also Read – HHVM Trolling: పవన్ సినిమాను టార్గెట్ చేసిన స్టార్ హీరోస్ ఫ్యాన్స్
హిట్టు కోసం పేరు మార్చుకొని…
హిట్టు కోసం తన పేరును రథినం కృష్ణగా మార్చుకొని కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ సినిమా చేశాడు జ్యోతికృష్ణ. పేరు మార్చుకున్న లక్ మాత్రం కలిసి రాలేదు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రూల్స్ రంజన్ నిలిచింది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఏఎమ్ రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇవన్నీ ఆయనకు భారీగా నష్టాలనే మిగిల్చాయి. హరిహర వీరమల్లుతోనైనా డైరెక్టర్‌గా ఫస్ట్ హిట్‌ను జ్యోతికృష్ణ అందుకుంటాడో లేదో చూడాల్సిందే.


