Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభHariHara VeeraMallu: పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి

HariHara VeeraMallu: పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu). ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండటంలో ఎన్నోసార్లు వాయిదాపడిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ట్రైలర్‌తో పాటు మూవీ సాంగ్స్ విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

- Advertisement -

క్రిష్, జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా కథ 17వ శతాబ్దం నాటి మొఘల్ రాజవంశం, కుతుబ్ షాహీల చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సాగనుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక వీరుడిగా, వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. మొఘలాయిలకు వ్యతిరేకంగా పోరాడే అజేయ వీరునిగా పవన్ స్క్రీన్‌పై దర్శించబోతున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, మొదటి భాగానికి ‘Hari Hara Veera Mallu: Part 1 – Sword vs Spirit’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ చిత్రం ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గిస్ ఫఖ్రీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News