Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభHariHara VeeraMallu: 'హరిహర వీరమల్లు' మూడో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

HariHara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ మూడో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu). ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండటంలో ఎన్నోసార్లు వాయిదాపడిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షూరూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ‘అసుర హననం..’ అంటూ సాగే ఈ పాటను మే 21వ తేదీ ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఓ పోస్టర్ విడుదల చేశారు.

జాగర్లమూడి క్రిష్, జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గిస్ ఫఖ్రీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News