Thursday, May 22, 2025
Homeచిత్ర ప్రభహరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు సినిమా పక్కా.. ఫ్యాన్స్ పండగ చేసుకోండి..!

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు సినిమా పక్కా.. ఫ్యాన్స్ పండగ చేసుకోండి..!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఐదేళ్లుగా సాగిన షూటింగ్ చివరికి ముగిసి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. నిర్మాత ఏఎం రత్నం తాజాగా స్పష్టంగా ప్రకటించిన ప్రకారం, సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

ఇప్పటికే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నుంచి గ్లింప్స్, టీజర్, మూడు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రతీ ఒక్క దానికీ భారీ స్పందన వస్తోంది. అయితే అనేక సార్లు వాయిదాపడిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఒక అనిశ్చితి నెలకొంది. మొదటి అనౌన్స్మెంట్ నుంచే దాదాపు తొమ్మిది సార్లు విడుదల తేదీ మారింది. ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్న ప్రతీసారి డేట్ వాయిదా పడుతుండటంతో కొంత మంది జూన్ 12 ప్రకటనపై కూడా సందేహమే వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్ ఈ సందేహాలకు తెరదించింది. ఈవెంట్‌లో నిర్మాత ఏఎం రత్నం స్పష్టంగా చెప్పారు ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయి. కానీ సమయం తక్కువగా ఉన్నా, ఈసారి వాయిదా వేయట్లేదని చెప్పారు. జూన్ 12న ఖచ్చితంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. రెండు ప్రమోషనల్ ఈవెంట్లు కూడా ఉంటాయని చెప్పారు.

ఈ ప్రెస్ మీట్‌లో దర్శకుడు జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే ఆలస్యం ఎక్కువైందన్న భావనతో ఏకాగ్రంగా విడుదలపై దృష్టి సారించిన చిత్రబృందం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ వాయిదా పడనిదని భరోసా కలిగిస్తోంది. ఇక మిగిలింది ఒక్కటే జూన్ 12న బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు ఎలా గర్జిస్తాడో చూడడం మాత్రమే.. ఎంతకాలం ఆగినా… పాన్-ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ విసిరిన ఈ మహా గాజు ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News