Harihara Veeramallu Trailer Update: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజయాలతో.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రం విడుదల పలు మార్లు వాయిదా పడుతూ వస్తోంది. తొలుత ఈ ఏడాది మార్చి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం జూన్ 12న రిలీజ్ చేస్తామన్నారు మేకర్స్. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వివాదం, VFX పనుల కారణంగా దీనిని కూడా వాయిదా వేశారు. ఇటీవలే జులై 24న కచ్చితంగా విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈమేరకు ప్రమోషన్స్ షూరూ చేసింది. జూన్ 24న మూవీలోని మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తామని తెలిపింది.
తాజాగా మూవీ ట్రైలర్ పైనా బిగ్ అప్టేడ్ ఇచ్చింది. మూవీ అధికారిక ఖాతా నుంచి ఎక్స్ వేదికగా అభిమానులతో చిత్రబృందం ముచ్చటించింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు. దీంతో వచ్చే ఆదివారం తప్పకుండా ట్రైలర్ అప్టేడ్ ఇస్తామని సమాధానం ఇచ్చింది. ఈసారి మిమ్మల్ని నిరాశకు గురిచేయమని తెలిపింది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. పవన్ ఇందులో చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని రెండు పార్టులుగా అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి పార్ట్ జులై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Harihara Veeramallu: హరిహర వీరమల్లు ట్రైలర్ అప్టేడ్.. ఫ్యాన్స్ హ్యాపీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES