Friday, June 6, 2025
Homeచిత్ర ప్రభHariHara VeeraMallu: 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల మరోసారి వాయిదా

HariHara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల మరోసారి వాయిదా

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan)అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా ‘హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu) సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తగెలిసిందే. అయితే మూవీలో కీలకమైన VFX వర్క్స్ ఇంకా పూర్తికాకవపోడంతో మరోసారి సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగానే సినిమా వాయిదా పడింది. ఈమేరకు మేకర్స్ అధికార ప్రకటన విడుదల చేశారు.

‘‘అచంచలమైన ఓపిక, నమ్మకంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన విధంగా జూన్ 12వ తేదీకి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతో శ్రమించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ రోజు సినిమాని విడుదల చేయలేకపోతున్నాం. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్‌ ఇమేజ్‌ను దృష్టిలోఉంచుకుని దీనిని మరింత గొప్పగా తీర్చిదిద్దాలనేది మా ఆలోచన. ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరికొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం’’ అని ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్ విలన్ గా కీలక పాత్ర పోషించారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News