పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయన కమిట్ అయిన సినిమాలు షూటింగ్ లేట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే ముందుగా హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అనంతరం ఓజీ సినిమాకు డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే నమ్మకం లేకుండా పోయింది. తాజాగా హరీశ్ శంకర్ మాత్రం ఈ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాకుండా సినిమాలోని ఓ సన్నివేశం గురించి చెప్పి అభిమానులకు పిచ్చి ఎక్కించేశాడు.
‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది. దీంతో తాజాా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ మూవీ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఉందని తెలిపాడు. ఆయన నిజ జీవితంలో కారు రూఫ్ మీద కూర్చొని వెళ్లిన సీన్ చూసి షాక్ అయ్యానని.. ఆ సీన్ ఆయనతో సినిమా తీసి రీ క్రియేట్ చేయాలని ఉందన్నాడు.
దీనిపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఆ కార్ సీన్ ఆల్రెడీ పెట్టేశానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సీన్ వెండితెర మీద చూస్తుంటే గూస్ బంప్స్ పక్కా అని ఎలివేషన్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఉంటుందని స్పష్టమైందని సంబరపడుతున్నారు .