Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభBakasura Movie Review: హారర్‌ కామెడీ జోనర్‌గా 'బకాసుర రెస్టారెంట్'.. వైవా హర్ష నవ్వించారా? రివ్వ్యూ...

Bakasura Movie Review: హారర్‌ కామెడీ జోనర్‌గా ‘బకాసుర రెస్టారెంట్’.. వైవా హర్ష నవ్వించారా? రివ్వ్యూ చూద్దాం రండి..!

Harror Comedy Bakasura Movie Review: ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌ సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజయ్యే షార్ట్‌ఫిల్మ్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా హారర్ కామెడీ జోనర్‌కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ జోనర్ లో రూపొందిన చిత్రమే ‘బకాసుర రెస్టారెంట్’. ప్రవీణ్, వైవా హర్ష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో ‘గరుడ’ రామ్ కీలకమైన పాత్ర పోషించాడు. ఆగస్టు 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బుధవారం ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్‌లో రిలీజైంది. ఎస్. జె. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

అసలు కథేంటి?

పరమేశ్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహతులతో కలిసి అతను ఓ షేరింగ్‌ రూమ్‌లో రెంట్‌కు ఉంటాడు. ప్రతి రోజూ ఆఫీస్‌లో బాస్‌తో చీవాట్లు తినడం కన్నా, సొంతంగా రెస్టారెంట్ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వస్తాడు. అందుకు అవసరమైన డబ్బును యూట్యూబ్ ద్వారా సంపాదించాలనుకుంటాడు. దీనికి స్నేహితులు కూడా సహకరిస్తామని చెబుతారు. అయితే, దెయ్యలకి సంబంధించిన కంటెంట్‌కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ ఉంటుంది భావించి దెయ్యాలపై రీసెర్చ్‌ ప్రారంభిస్తారు. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ‘రుద్రారం’ అనే గ్రామానికి దగ్గరలో ఉన్న ఓ పాడుబడ్డ బంగళాను షూటింగ్‌కు ఎంపిక చేసుకుంటారు. చాలా కాలం క్రితం నుంచి ‘ఖాసీమ్ వలి’ ఆమె ఒక క్షుద్ర మాంత్రికుడు ఆ బంగళాలో క్షుద్ర పూజలు చేస్తూ ఉండేవాడు. అయితే, క్షుద్రపూజలు వికటించడం వలన, అతను అక్కడే చనిపోతాడు. అప్పటి నుంచి ఆ బంగళాలో అతను దెయ్యమై తిరుగుతున్నాడనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. అలాంటి, భయంకరమైన ఆ బంగళాకి పరమేష్‌ మిత్ర బృందం చేరుకుంటుంది. ఆ బంగళాలో అడుగుపెట్టిన వారికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాంత్రిక విద్యలకు సంబంధించిన ఒక గ్రంథం వారికి దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని తీసుకుని అక్కడి నుంచి బయటపడతారు. అయితే, అసలు ఆ గ్రంథంలో ఏముంది? ఆ గ్రంథాన్ని వెంట పెట్టుకున్న వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? బకాసుర ఎవరు? అతని గతం ఏంటి? పరమేశ్ కోరిక నెరవేరుతుందా? అనేదే ఈ కథ.

కామెడీ ఆకట్టుకుంటుందా?

బ్రతుకుదెరువు కోసం విలేజ్ నుంచి పట్నం వచ్చిన ఐదుగురు యువకుల కథ ఇది. రెస్టారెంట్ పెట్టుకుని హ్యాపీగా బ్రతకాలనుకున్న వారికి, తాంత్రిక విద్యలకు సంబంధించిన ఒక గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని వాళ్లు ఎలా ఉపయోగించుకుంటారు? దాని వల్ల తమ ‘కల’ను నిజం చేసుకోగలిగారా లేదా? అనే ఒక లైన్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కాకపోతే మొత్తం కథను అదే కుతూహలంతో తెరపై ఆవిష్కరించలేకపోయాడు దర్శకుడు. అయితే, ఈ హారర్ కామెడీ జోనర్ భయపెడుతూనే నవ్విస్తూ ఉంటుంది. కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్‌ అవుతారు. కాకపోతే, ఒకే అంశానికి సంబంధించిన సన్నివేశాలను పదే పదే చూపిస్తూ, సిల్లీ కామెడీతో ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతారు. ఈ కథలో హారర్ అంశాల కంటే, హాస్యం పేరుతో వేసిన ఆకతాయి వేషాలే ఎక్కువగా భయపెడతాయని చెప్పవచ్చు.

నటీనటుల పనితీరు ఎలా ఉంది?

దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగుంది. ‘బకాసుర’ అనే టైటిల్‌కి న్యాయం చేయాలనే విషయంపైనే దర్శకుడు పూర్తి ఫోకస్ చేశాడు. అందువల్లనే భోజనాలకి సంబంధించిన సన్నివేశాలే తెరపై రిపీట్ అవుతూ విసుగు తెప్పిస్తాయి. క్లైమాక్స్ కూడా దర్శకుడు సీరియస్ కంటెంట్ పై దృష్టి పెట్టకుండా సిల్లీ కామెడీనే నమ్ముకోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. వైవా హర్ష ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అయితే, ఇతర ఆర్టిస్టుల నటన ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఇక, బాలసరస్వతి ఫొటోగ్రఫీ, వికాస్ బడిస నేపథ్య సంగీతం, మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ కొంతమేర ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గాఈ కథలో హారర్‌తో పాటు కామెడీ కూడా ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. అయితే, ఈ రెండు ట్రాకులు కాస్త బలహీనంగా కనిపిస్తాయి. కథలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ కూడా తేలిపోతుంది. వినోదపరమైన సన్నివేశాలు ఎక్కువగా లేకపోవడం మైనస్‌ అనే చెప్పవచ్చు. ఏదేమైనా హారర్‌ కామెడీ కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.

రివ్యూ: 2/5

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad