Rukmini Vasanth: కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌కు (Rukmini Vasanth) పాన్ ఇండియా అవకాశాలు వరుసగా వచ్చి, ఆమె ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘కాంతారా చాప్టర్ 1’, (Kantara Chapter 1) ‘డ్రాగన్’ (Dragon) లాంటి పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు రావడం వల్ల ఆమె పేరు తెగ ప్రచారంలో ఉంది. ఇండస్ట్రీలో చాలా హీరోయిన్లు ఉన్నా, ఈ భారీ సినిమాలు మాత్రం రుక్మిణీని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. దీనివల్ల ఆమెను “లక్కీ గాళ్” అంటున్నారు. ఇప్పుడు రుక్మిణీ మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది అంటే, అది చిన్న విషయం కాదు. ఈ సినిమాల వల్ల ఆమె పేరు దేశవ్యాప్తంగా వినిపించబోతోంది. కానీ ఇదే సమయంలో, ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోతుండటం కాస్త నిరాశ కలిగిస్తోంది. ఈ సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు.
గతేడాది రుక్మిణీ తెలుగు ప్రేక్షకులకు “అపుడో ఎపుడో” సినిమాతో పరిచయమైంది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తరువాత కోలీవుడ్‌లో విజయ్ సేతుపతితో కలిసి ‘ఏస్’ అనే సినిమాలో నటించింది. మొత్తం చెప్పాలంటే, రుక్మిణీకి పెద్ద అవకాశాలు వచ్చినా, ఆ సినిమాల విజయాలు మాత్రం ఆశించినంతగా లేవు. ఇది ఆమె కెరీర్‌కి కొంత డౌన్‌సైడ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read – Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ వివాదం.. ఆ రాష్ట్రంలో మూవీ రిలీజ్ కాదా!
రుక్మిణీ వసంత్ నటించిన ‘ఏస్’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తొలి రెండు పరాజయాల తర్వాత అయినా తదుపరి చిత్రం ద్వారా ఒక్క హిట్ అందుకుంటుందేమో అని ఆశపడింది. కానీ ఆ ఆశలు కూడా చిగురించక ముందే చెదిరిపోయాయి. ఇటీవల విడుదలైన ‘మదరాసి’ సినిమాలో శివ కార్తికేయన్ సరసన రుక్మిణీ నటించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఫలితంతో ఆమె ఖాతాలో వరుసగా మూడు ప్లాప్‌లు నమోదు అయ్యాయి. దీంతో, ఆమె పాన్ ఇండియా ప్రాజెక్టుల ప్రయాణానికి ఇది కొంత చెడు ప్రభావం చూపేలా మారింది.
విజయాలతో ఆత్మవిశ్వాసంగా ఉన్న రుక్మిణీ, తన పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్‌ను జోరుగా పూర్తి చేయాలనుకుంది. కానీ వరుస పరాజయాలు ఆమెకు షాక్ ఇచ్చినట్లయ్యాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే, ఏ నటి అయినా విజయాల సమయంలోనే తన కెరీర్‌ను స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు రుక్మిణీ కూడా అదే చేస్తుందేమో చూడాలి. పాన్ ఇండియా సినిమాల తర్వాత ఆమె ఎలాంటి స్ట్రాటజీ తీసుకుంటుందో, ఎలా మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందో ఆసక్తిగా చూడాల్సిందే.
Also Read – Supreme Court: నేపాల్‌లో పరిస్థితి గమనించండి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


