Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభNayanthara Dhanush: నయనతారపై హీరో ధనుష్ కేసు

Nayanthara Dhanush: నయనతారపై హీరో ధనుష్ కేసు

స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan)పై తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) కేసు పెట్టారు. తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’(నేనే రౌడీ) విజువల్స్‌ వాడుకోవడంతో ధనుష్ నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు నయనతార దంపతులపై సివిల్‌ కేసు పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

కాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ధనుష్‌కు నయనతార బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయనతో తీవ్ర విమర్శలు చేశారు నయన్. మూడు సెకన్ల క్లిప్స్‌ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్‌ చేయడం విచారకరమని మండిపడ్డారు. మరోవైపు నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ కూడా ధనుష్ తీరుపై మండిపడ్డారు. ధనుష్ మంచివాడు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ నయనతార దంపతులపై హైకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad