తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi)కి ప్రమాదం జరిగింది. సర్దార్-2(Sardar-2) చిత్రీకరణ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఛేజింగ్ సన్నివేశాలు ఘాట్ చేస్తుండగా కార్తీ కాలికి గాయం అయింది. వెంటనే చిత్ర బృందం కార్తీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దీంతో ఆయన చెన్నైలోని తన ఇంట్లోకి విశ్రాంతి తీసుకుంటున్నారు.
- Advertisement -
కార్తీకి ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న సర్దార్2 సినిమాలో కార్తీ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా.. ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘సర్దార్’ మూవీ సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.