Kiran Abbavaram : సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సాధారణం. అయితే రెండింటిని బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేయటం తెలిసి ఉండాలి. అది తెలియనప్పుడు ఎక్కువగా ఫీల్ కావాల్సి ఉంటుంది. ఈ విషయంపై హీరో కిరణ్ అబ్బవరం పూర్తి అవగాహనతోనే ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం కె-ర్యాంప్. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ అవుతోంది. జైన్ నాని దర్శకుడు. యుక్తి తరేజా దర్శకుడు. సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిరణ్ అబ్బవరం సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇంతకీ ఆయన ఏమమన్నారంటే..
‘‘సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్డ్స్‌గా తీసుకోవటం నాకు అలవాటు అయిపోయింది. మొన్న పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నేనేమీ గొప్పగా ఫీల్ కాలేదు. నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఓ సక్సెస్‌కి వచ్చినప్పుడు మనలో తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రేక్షకుల దగ్గర ఓ నమ్మకాన్నితెచ్చుకోవాలి. కిరణ్ సినిమా వస్తుంది.. అంటే బావుంటుందిరా అనుకోవాలి. అలాంటి నమ్మకం ఎప్పుడు వస్తుంది. వరుసగా రెండు, మూడు డిఫరెంట్ కంటెంట్స్ వచ్చినప్పుడు అందరికీ నమ్మకం వస్తుంది. ప్రస్తుతానికి ఆ మైండ్ సెట్‌లోనే నేను ఇప్పుడు ఉన్నాను.
సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చిప్పుడు హై కావటం అనేది లేదు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశాను. చేతిలో పని ఉందా! దాన్ని బాగా చేసుకుంటున్నామా అనేది ముఖ్యం. అన్నీ నా చేతిలో ఉండవు. ఎంత కష్టపడినప్పటికీ అన్నీ నా చేతిలో ఉండవు. సక్సెస్ అనేది అందరిదీ..ఎంటైర్ టీమ్‌ది. అందరూ కామన్‌గా కలిసి పని చేస్తాం. అదే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం హీరోని, డైరెక్టర్‌నే వేలెత్తి చూపిస్తాం. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే అది నేనే తీసుకుంటాను. ఎందుకంటే అది నేను ఒప్పుకుని చేశాను కాబట్టి అది నా సినిమా అవుతుంది. మధ్యలో ఏమైనా కావొచ్చు. అది నా తప్పే కావొచ్చు.. లేదా ఇంకొకరిది కావచ్చు. నేను ఒప్పుకోకపోతే సినిమా అయితే కాదు. ఆరోజు ఒప్పుకున్నాను కాబట్టి సినిమా స్టార్ట్ అయ్యింది. కాబట్టి నా సినిమా ఫెయిల్యూర్ అయితే నేను ఫస్ట్ తీసుకుంటాను’’ అన్నారు.


