K-Ramp: క (KA) సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడు మరోసారి కె సెంటిమెంట్‌తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే కె ర్యాంప్ (K-Ramp). జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్ పతాకాలపై రాజేష్ దండ, శివ బొమ్మకు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న మూవీ రిలీజ్ (K ramp release date) అవుతోంది. అబ్బవరం సరసన యుక్తి తరేజా (Yukti Thareja) కథానాయికగా నటిస్తోంది.
సినిమా ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే.. టీజర్ బాగానే ఉన్నప్పటికీ అందులోని బూతు పదాలు ప్రేక్షకులకు షాకిచ్చాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర కావాల్సిన హీరో కిరణ్ అబ్బవరం ఈ రూట్ ఎందుకు తీసుకున్నాడా? అని అనుకున‌్నవారు లేకపోలేదు. రీసెంట్‌గా జరిగిన ప్రెస్‌మీట్‌లో దీనిపైనే హీరోకి ప్రశ్న ఎదురైంది. అయితే కిరణ్ అబ్బవరం దీనిపై క్లారిటీ ఇచ్చాడు. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేలా టీజర్‌లో కొన్ని పదాలను జోడించారే తప్ప.. సినిమా మొత్తంలో అలాంటి బూతు పదాలుండవని వివరణ ఇచ్చారు. ఈ విషయంపై థియేటర్‌కి వస్తే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని ఆయన పేర్కొన్నారు.
Also Read – Bigg Boss Sanjana Galrani: ఇదేం న్యాయం నాగార్జున గారు.. హరీష్ ని బలి చేసేశారుగా..!
కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని రూపొందించామని, అందరూ ఈ సినిమాను ఆహ్లాదంగా చూసి ఎంజాయ్ చేస్తారని కిరణ్ అబ్బవరం భరోసా ఇచ్చారు. కె ర్యాంప్ (K-Ramp) లో మంచి ఎమోషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా కిరణ్ పేర్కొన్నారు. టీజర్ చూసి అపోహలు పడాల్సిన అవసరం లేదని, ట్రైలర్ విడుదలయ్యే సమయానికి ఈ విషయంలో మరింత పూర్తి క్లారిటీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు కె ర్యాంప్ (K-Ramp) మీద ఉన్న బూతులు కాంట్రవర్సీపై హీరో నుంచి వివరణ వచ్చేసింది. మరి ఇక ఆయన చెప్పినట్లు ట్రైలర్‌తో ఎలాంటి హైప్స్ వస్తాయో చూడాలి మరి.
క మూవీతో కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన కిరణ్ అబ్బవరం దాన్ని కంటిన్యూ చేయటంలో తడబడ్డాడు. ఆ తర్వాత వచ్చిన దిల్ రూబా చిత్రం డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ యువ కథానాయకుడు కె ర్యాంప్‌పై ఫోకస్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొడతాననే కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు కిరణ్ అబ్బవరం.
Also Read – Shraddha Kapoor: రెడ్ శారీలో హాట్ మిర్చిలా శ్రద్ధా కపూర్


