Tuesday, April 15, 2025
Homeచిత్ర ప్రభHIT 3 Trailer: నాని ‘హిట్‌-3' ట్రైల‌ర్‌ వచ్చేసింది.. గూస్ బంప్స్ పక్కా

HIT 3 Trailer: నాని ‘హిట్‌-3′ ట్రైల‌ర్‌ వచ్చేసింది.. గూస్ బంప్స్ పక్కా

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. గతేడాది ‘సరిపోదా శనివారం’ మూవీతో పలకరించిన నాని.. ఇప్పుడు ‘హిట్‌ 3′(Hit 3)తో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యాడు. ‘హిట్‌’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న ‘హిట్‌3: ది థర్డ్‌ కేస్‌’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు సినిమాలపై అంచనాలు పెంచేశాయి.

- Advertisement -

తాజాగా మూవీ యూనిట్ ట్రైల‌ర్‌ను(HIT 3 Trailer) విడుద‌ల చేసింది. వరుస హత్యలు.. అర్జున్‌ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుందనేది తెలుస్తోంది. అర్జున్‌ సర్కార్‌గా నాని సంభాషణలు, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హోం బ్యానర్‌ వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 1న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News