NTR – Saamrajyam: సినిమాను రూపొందించటం కాదు.. దాన్ని ప్రమోట్ చేయటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటి విషయాల్లో ఎవరైనా సపోర్ట్ అందిస్తే చాలా గొప్ప విషయం. ఇప్పుడు తారక్‌ను చూసి ఇతర సినీ పరిశ్రమలకు చెందిన సినీ ప్రేమికులు అలాగే అంటున్నారు. అందుకు కారణం.. ఆయన డబ్బింగ్ సినిమాలకు అండగా నిలబడుతూ వాటి సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన డబ్బింగ్ సినిమా కాంతార చాప్టర్ 1ను (Kantara Chapter 1) ఆడియెన్స్‌కు దగ్గర చేయటంలో తారక్ చేసిన హెల్ప్‌ను మన అభిమానులే కాదు.. చిత్ర యూనిట్ కూడా అంత సులువుగా మరచిపోదు.
రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’ వరల్డ్ వైడ్‌గా మంచి వసూళ్లను సాధిస్తోంది. తెలుగు విషయానికి వస్తే రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించటం విశేషం. భారీ అంచనాలు పెట్టుకున్న స్ట్రయిట్ తెలుగు సినిమాలు సాధించని సక్సెస్‌ని ఈ సినిమా సొంతం చేసుకుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గాయంతోనే హాజరు కావటం ఆయన కమిట్‌మెంట్‌కు, రిషబ్ పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. తారక్ రావటం అనే విషయం.. సినిమా మనకు కనెక్ట్ కావటంలో కీలక పాత్రను పోషించిందనే చెప్పాలి. అంతే కాదండోయ్.. కాంతార చాప్టర్ 1 రిలీజ్ తర్వాత కూడా రిషబ్ శెట్టి అండ్ టీమ్‌ను అభినందిస్తూ తారక్ ట్వీట్ కూడా చేశాడు.
Also Read – Kantara Chapter 1: రెండు వారాల్లో ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. హిట్ కోసం ఎంత రావాలంటే!
వార్ 2 (War 2) విషయానికి వస్తే ఈ సినిమా పక్కా బాలీవుడ్ మూవీ. ఇందులో తారక్ నటించాడు. అయితే తెలుగు సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయంటే ఏకైక కారణం ఎన్టీఆర్ మాత్రమే. తెలుగులో సినిమాను ప్రేక్షకులకు రీచ్ కావటంలో అంతా తానై ముందుండి నడిపాడు. ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను కొంత నిరాశపరిచినప్పటికీ, వసూళ్లు ఆ మాత్రమైనా వచ్చాయంటే కారణం మాత్రం తారక్.
తాజాగా ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాకు తారక్ స్నేహ హస్తం అందించాడు. ఆ సినిమా మరేదో కాదు.. సామ్రాజ్యం. దర్శకుడు వెట్రిమారన్, హీరో శిలంబరసన్‌తో ఉన్న సానిహిత్యంతో సినిమా టైటిల్ ప్రమోషన్‌ను రిలీజ్ చేయటానికి తారక్ ముందుకు వచ్చాడు. మేకర్స్ దీనికి వీలైనంతగా తెలుగు ఫ్లెవర్స్ ఉండేలా చూసుకుంటున్నారు. మరో వైపు వెట్రిమారన్, శిలంబరసన్ లకు ఇక్కడ మంచి గుర్తింపు ఉండటంతో సినిమాకు మంచి ఓపెనింగ్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదే విధంగా తారక్ బాటను మరెంత మంది టాలీవుడ్ హీరోలు ఫాలో అవుతారో చూడాలి మరి.
Also Read – Sudheer Babu: సుధీర్ బాబు ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ!


