Rajasekhar: రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు కనిపించి చాలా కాలమే అవుతోంది. నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటించారు. ఈ సినిమా రిలీజై రెండేళ్లు దాటినా రాజశేఖర్ కొత్త సినిమా ఏది మొదలుపెట్టలేదు. పవన్ సాదినేనితో పాటు మరికొంత మంది నయా డైరెక్టర్లతో రాజశేఖర్ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు.
Also Read – Telangana: రేవంత్ ఐడియాలజీకి తగ్గ బాస్ ఆయనేనా.. పోలీస్ శాఖలో ఆసక్తికర చర్చ!
తమిళ రీమేక్…
తాజాగా రాజశేఖర్ ఓ తమిళ రీమేక్‌లో నటిస్తున్నాడు. కోలీవుడ్‌లో గత ఏడాది రిలీజైన పెద్ద విజయాన్ని సాధించిన లబ్బరపందు మూవీ తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఈ రీమేక్‌లో రాజశేఖర్ ఓ హీరోగా నటిస్తున్నారు. అంతే కాకుండా రాజశేఖర్ కూతురు శివానీ కూడా ఈ సినిమాలో నటిస్తున్నదట. 35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ మరో హీరోగా కనిపించబోతున్నట్లు సమాచారం. అతడికి జోడీగా శివాని నటిస్తున్నట్లు చెబుతున్నారు. లబ్బరు పందు తమిళ వెర్షన్‌లో దినేష్, హరీష్ కళ్యాణ్ హీరోలుగా నటించారు. తెలుగులో దినేష్ రోల్‌లో రాజశేఖర్, హరీష్ కళ్యాణ్ పాత్రలో విశ్వదేవ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. లబ్బరు పందు సినిమాలో యశోద పాత్ర స్వాసికకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ రోల్ తెలుగులో ఎవరూ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. లబ్బరు పందు తెలుగు రీమేక్‌ను రాజశేఖర్ స్వయంగా నిర్మించబోతున్నట్లు సమాచారం.
మిస్టేక్ చేస్తున్నాడా?
లబ్బరు పందు రీమేక్‌ను ఎంచుకొని రాజశేఖర్ మిస్టేక్ చేస్తున్నాడని నెటిజన్లు చెబుతున్నారు. తమిళ వెర్షన్ ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యింది. ఓటీటీలో రిలీజైంది. చాలా మంది తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను చూశేశారు. మళ్లీ రీమేక్ చేస్తే ఎంత వరకు చూస్తారన్నది అనుమానమే. మరోవైపు క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ డ్రామా మూవీ ఇది. తెలుగు రీమేక్‌లో పెద్దగా మార్పులు చేసేందుకు పెద్దగా స్కోప్ లేదు. చాలా వరకు ఒరిజినల్‌ను ఫాలో కావడం తప్పితే పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మరోవైపు సీనియర్ క్రికెటర్ రోల్‌కు రాజశేఖర్ ఎంత వరకు సెట్ అవుతాడన్నది ఆసక్తికరంగా మారింది. లబ్బరు పందుతో పాటు శర్వానంద్, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Akhanda 2: 600 మంది డానర్స్‌తో అఖండ 2 సాంగ్.. ఫ్యాన్స్ ఊగిపోవటం పక్కా!


