Saturday, January 11, 2025
Homeచిత్ర ప్రభHero Ram Pothineni: హీరోగా రామ్ పోతినేనికి 19 ఏళ్లు..

Hero Ram Pothineni: హీరోగా రామ్ పోతినేనికి 19 ఏళ్లు..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని పేరు వెంటే ఈరోజుకీ అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. ఆ అందానికి, కటౌట్‌కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. ఇప్పటికీ బ్యాచిలర్‌గా ఉండి అమ్మాయిల మనసులు దోచేస్తున్నాడు. ఇంతకీ మాటర్ ఏంటి అంటే రామ్ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్ల తన ప్రయాణం ఎంత సాహసోపేతమైనది, ఎంతో విజయవంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. 2006లో “దేవదాసు” అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన కెరీర్‌ను అద్భుతంగా ఇప్పటివరకూ కొనసాగించారు. చిన్న వయసులోనే సినీ రంగంలో తన పాత్రలు, సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయన విజయవంతమైన హీరోగా నిలిచారు.

- Advertisement -

ఆయన కెరీర్లో “మస్కా”, “కందిరీగ”, “ఒంగోలు గిత్త”, “మసాలా”, “పండగ చేస్కో”, “హైపర్”, “ఇస్మార్ట్ శంకర్”, “రెడ్”, “స్కంధ”, “డబుల్ ఇస్మార్ట్” వంటి భారీ హిట్లలో నటించి, టాలీవుడ్‌లో తన పేరు ముద్రించారు. “ఇస్మార్ట్ శంకర్” చిత్రం ప్రత్యేకంగా రామ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం అతని పర్ఫామెన్స్‌కి, యాక్షన్‌ సన్నివేశాలకి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రశంసలు లభించాయి. ఈ ఏడాదిలో తన కొత్త సినిమా ఒకటి రాబోతుంది.

రామ్ తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి చాలా విధాలైన పాత్రలను పోషించి, తన ప్రతిభను నిరూపించుకున్నారు. యువ హీరోగా, అతని నటనలో భావోద్వేగం, హ్యుమర్, యాక్షన్ అన్ని చాలా బలంగా కనిపిస్తాయి. ఈ సినిమాలు రామ్ పట్ల ఉన్న అభిమానాన్ని మరింత పెంచాయి. సినిమా అభిరుచులు ఉన్న యువత రామ్ నటనను, చిత్రాలకు సంబంధించిన కథలను చాలా ఇష్టపడతారు.

అయితే, రామ్ పోతినేని ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా ఈజీగా సమాచారం ఇచ్చే వాడిగా కనిపించకపోవచ్చు, కానీ కెరీర్ పరంగా ఎంతో శ్రమతో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం ఆయన మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులపై పని చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన సినిమాల గురించి, ప్రాజెక్టుల గురించి అప్‌డేట్‌లు అందిస్తూ, తమ అభిమానులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచే విధంగా ఉన్నారు.

రామ్ పోతినేని తన 19 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి, టాలీవుడ్ పరిశ్రమలో తన స్థాయిని పటిష్టం చేసుకున్నాడు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి, సినీ పరిశ్రమలో తన టాలెంట్‌ను నిరూపించుకుంటారని అందరికీ ఆశయంగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News