Saturday, November 15, 2025
HomeTop StoriesRam Pothineni : రామ్ చరణ్‌ను అప్పుడు చూసి జాలేసింది.. హీరో రామ్ కామెంట్స్ వైరల్

Ram Pothineni : రామ్ చరణ్‌ను అప్పుడు చూసి జాలేసింది.. హీరో రామ్ కామెంట్స్ వైరల్

Ram Charan – Ram Pothineni : రామ్ పోతినేని.. టాలీవుడ్ హీరో. తనదైన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ క‌థానాయ‌కుడు సాధార‌ణంగా మీడియా ముందుకు రాడు. సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలోనే అంద‌రికీ క‌నిపిస్తాడు. మిగ‌తా స‌మ‌యంలో తన సినిమాలు, త‌న లోకం అన్న‌ట్లుగా ఉంటాడు. బెస్ట్ సినిమా ఇవ్వ‌టానికి శ‌క్తివంచ‌న లేకుండా క‌ష్ట‌ప‌డుతుంటాడు. ప్ర‌స్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను కంప్లీట్ చేయ‌టంలో బిజీగా ఉన్నాడు రామ్‌. అయితే హీరో జ‌గ‌ప‌తిబాబుతో ఉన్న స‌న్నిహితంతో ఆయ‌న హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’కు గెస్ట్‌గా వెళ్లాడు. సినీ రంగంలో త‌న జ‌ర్నీ స‌హా జ‌గ‌ప‌తిబాబు అడిగిన విష‌యాల‌పై రామ్ ఓపెన్‌గా స్పందించాడు.

- Advertisement -

టాలీవుడ్ నిర్మాత స్ర‌వంతి ర‌వి కిషోర్ అన్న కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌దైన క‌ష్టంతో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. దీని గురించి రామ్ మాట్లాడుతూ స్టార్ కిడ్‌గా ఉండ‌ట‌మ‌నేది చాలా క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని పేర్కొన్నాడు. ‘బ‌య‌ట నుంచి చూసే వాళ్ల‌కి సినిమా అంటే రంగుల ప్ర‌పంచంగా క‌నిపిస్తుంది. కానీ ఇక్క‌డ ఉండే ఒత్తిడి, ఇబ్బందులు గురించి వాళ్ల‌కి తెలియ‌వు. దేవ‌దాసు హిట్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవిగారికి ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. ఆ స‌మ‌యంలో ‘తొలి సినిమాతోనే చాలా పెద్ద హిట్ కొట్టావు. తొలి హిట్‌కే పొంగిపోకు. స‌క్సెస్ వ‌చ్చింది కదా అని స‌డ‌లింపుగా ఉండ‌కు. ప్ర‌తి సినిమాకు ఇలాగే క‌ష్ట‌ప‌డు’ అని ఆయన ఇచ్చిన స‌ల‌హా నాకు ఇంకా గుర్తుంది. నా కెరీర్‌లో అదెంతో ఉప‌యోగ‌ప‌డింది’ అని రామ్ తెలిపారు.

అయితే చిరంజీవిగారిలాంటి తండ్రి తనకు ఉంటే చాలా బావుండున‌ని అనుకున్నాన‌ని, పెద్ద ఫ్లాట్ ఫామ్‌తో బిగ్ స్టార్ కిడ్‌గా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చుండేవాడిన‌ని అనుకునేవాడినని, అయితే రామ్ చ‌ర‌ణ్‌ను చూసిన త‌ర్వాత త‌న అభిప్రాయం మారిపోయింద‌ని రామ్ అన్నాడు. త‌నేమో తొలి సినిమా స‌క్సెస్ జోష్‌లోఉంటే, రామ్ చ‌ర‌ణ్ డిఫ‌రెంట్‌గా క‌నిపించాడని, స్టార్ కిడ్‌గా ఉండే ఆ ప్రెష‌ర్ త‌న‌కు రామ్‌చ‌ర‌ణ్ ముఖంలో క‌నిపించింద‌ని, స్టార్ లెగ‌సీని కంటిన్యూ చేయ‌టంలో ఉండే ఒత్తిడిని అర్థం చేసుకున్నాన‌ని, ఆ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్‌ను చూస్తే జాలేసింద‌ని రామ్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad