Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభRam Pothineni: నిర్మాతగా మారబోతున్న మరో టాలీవుడ్ స్టార్..

Ram Pothineni: నిర్మాతగా మారబోతున్న మరో టాలీవుడ్ స్టార్..

Tollywood Producers: మన తెలుగు స్టార్ హీరోలలో ప్రస్తుతం ఒకవైపు హీరోగా నటిస్తు మరోవైపు నిర్మాతగాను సినిమాలు చేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. కోర్ట్ లాంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు నాని. ఆ తర్వాత హిట్ 3 సినిమాను నిర్మించి హీరోగా నటించి హిట్ కొట్టారు. ప్రస్తుతం నాని క్రేజీ మూవీస్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇదే దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నాని.

- Advertisement -

ఇప్పుడు నాని తరహాలోనే మరో టాలీవుడ్ హీరో నిర్మాతగా మారబోతున్నారు. ఇంతకాలం పెదనాన్న సంస్థలో సినిమాలు చేసిన ఆయన సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నారట. ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని. ఇంతకాలం మాస్ మేకోవర్‌తో ప్రయోగాలు చేస్తూ వచ్చినా ఈ ఎనర్జిటిక్ హీరో.. గత కొంతకాలంగా చేస్తున్న కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చేసి షాక్ తిన్నాడు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాలో నటిస్తున్నారు రామ్. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రను పోషిస్తున్నారు. పి మహేష్ బాబు దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే సినిమా తరువాత రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది కన్‌ఫర్మ్ కాలేదు. కానీ, తాజా సమాచారం మేరకు రామ్ సొంత నిర్మాణ సంస్థను స్థాపించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, టాలెంటెడ్ డైరెక్టర్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

దీనిలో భాగంగా ముందు తనే హీరోగా ఓ సినిమాకి ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. ఈ ఏడాదిలోపు రామ్ తన బ్యానర్ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ మన హీరోలకి సొంత వ్యాపారాలున్నాయి. కొందరు మల్టీప్లెక్స్ రంగంలో ఉన్నారు. కొందరు రెస్ట్రారెంట్స్ నడుపుతున్నారు. ఇక నాని, సమంత లాంటి వారు మాత్రం నిర్మాతలుగా మారి అభిరుచికి తగ్గ సినిమాలు అందిస్తున్నారు.

అలాగే, రామ్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారట. అయితే, ఈ సంస్థలో హీరోగా ఆయన ఒక్కడి సినిమాలే నిర్మిస్తారా లేక బయట హీరోలతోనూ ప్లాన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. నానీ కథ నచ్చితే అందులో ఎవరు సూటవుతారో వాళ్ళతో నిర్మిస్తున్నారు. త్వరలో మెగాస్టార్ హీరోగా నాని ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరి రామ్ ప్లాన్ ఎలా ఉన్నాయో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News