Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRavi Teja: 3 నెలలు.. రెండు సినిమాలు

Ravi Teja: 3 నెలలు.. రెండు సినిమాలు

Ravi Teja Upcoming Movies: మాస్ మహారాజా రవితేజకు హిట్ వచ్చి మూడేళ్లవుతుంది. ఆయన లాస్ట్ సినిమా వచ్చి ఏడాది దాటేసింది. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఏకంగా రెండు సినిమాలతో మాస్ మహారాజా సందడి చేయబోతున్నాడు. ఇంతకీ ఏంటా సినిమాలు.. రిలీజ్‌లెప్పుడు? అనే వివరాలను ఓసారి చూసేద్దాం..

- Advertisement -

మామూలుగా ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయించుకోవడమే గగనమైపోయింది. అలాంటిది రెండున్నర నెలల్లో రెండు సినిమాలు విడుదలంటే అసలు ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ రవితేజకది జరిగేలా ఉంది. ఇప్పటికే పలు వాయిదాల మధ్య ఆలస్యమవుతూ వచ్చిన మాస్ జాతర (Mass Jathara) అక్టోబర్ 31 దాదాపు లాక్ చేసుకున్నట్టే. బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ తప్ప ఆ రోజు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. పండగ సీజన్ కాకపోయినా టాక్ బాగుంటే కమర్షియల్ ఫుల్ బాగా ఉండే టైం కనక నిర్మాత నాగవంశీ ధీమాగా ఉన్నారట. ప్రకటన రాలేదు కానీ ఫైనల్ చేసే చర్చలు చివరి దశలో ఉన్నాయని టాక్.

Also read – Telugu Movie Titles: తెలుగు సినిమా టైటిల్స్ నెటివిటీ పోతుందా?

మాస్ జాతర మీద ఇప్పటికైతే బజ్ పెద్దగా లేదు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల (Sreeleela) హీరోయిన్. ధమాకా (Dhamaka) మేజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం. ముందు అనార్కలి టైటిల్ అనుకున్నారు కానీ ప్రస్తుతం దానికి బదులు మరో వెరైటీ పేరు పెట్టే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా రవితేజకు పెట్టని టైటిల్ సెట్ చేయబోతున్నట్టు తెలిసింది.

పండక్కు ఎంత పోటీ ఉన్నా సరే జనవరి 13 ఈ మూవీని రిలీజ్ చేయాలని సంకల్పించుకున్నారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. నిజమైతే మాత్రం ఇంత తక్కువ గ్యాప్ లో మాస్ మహారాజా సినిమాలు ఎంజాయ్ చేయడం అభిమానులకు స్పెషల్ గా ఉండిపోతుంది. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే స్పీడ్ విషయంలో రవితేజ ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. కాకపోతే దర్శకులు సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మాస్ జాతర, తిరుమల కిషోర్ సినిమాలు హిట్టయ్యి మళ్ళీ తనను ట్రాక్ లోకి తీసుకురావడం కోసమే సినీ ప్రియులు వెయిటింగ్.

Also read – Tollywood Heroes: స్టార్ హీరోల డబుల్ ధమాకా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad