Teja Sajja: బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ సజ్జా.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోగా మారాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలకు ఓ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో రూ. 300 కోట్ల బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ కుర్ర హీరో.. ఈ ఏడాది వచ్చిన ‘మిరాయ్’తో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రూ.150 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. దీంతో ఇప్పుడీ యంగ్ హీరో మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
తేజ సజ్జా మార్కెట్ ఇప్పుడు పెరిగింది. తన సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్ అని సినీ సర్కిల్స్‌లో వార్తొకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. తేజ సజ్జా నెక్ట్స్ చేయబోతున్న ‘జాంబీ రెడ్డి 2’ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. అదేంటి? అసలు కథేంటో తెలియదు.. నటీనటులపై అసలు క్లారిటీ లేదు. కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ కావడమేంటా? అనే సందేహం కలుగక మానదు. కానీ.. ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ జాంబీ రెడ్డి 2 డిజిటల్ హక్కులకు అప్పుడే రూ.42 కోట్లు చెల్లించటానికి రెడీ అయ్యింది. 2021లో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన జాంబీ రెడ్డి.. మంచి హిట్ మూవీగా నిలిచింది. దీనికి ప్రశాంత్ వర్మ సీక్వెల్‌ను ఎప్పుడో ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. కేవలం కథను మాత్రమే అందించబోతున్నాడు. మరో దర్శకుడు సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. బ్యానర్ కూడా మారింది. ఇప్పుడీ సీక్వెల్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేయబోతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మరింత క్లారిటీ వస్తుందని సమాచారం.
Also Read- Samantha: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సెలబ్రేషన్స్ – ఫొటోలు వైరల్


