Vijay Deverakonda ED Enquiry: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశానని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తన పేరు రావడంతో విచారణకు పిలిచారని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అయితే, దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అనే రెండు రకాలు ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు. తాను A23 అనే గేమింగ్ యాప్‌ని మాత్రమే ప్రమోట్ చేశానని, బెట్టింగ్ యాప్స్‌తో దానికి సంబంధం లేదని రౌడీ స్టార్ క్లారిటీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ అందించిన వివరాల ప్రకారం, గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధంగా (లీగల్) నడుస్తున్నాయి. అంతేకాకుండా గేమింగ్ యాప్స్‌కు జీఎస్టీ, పన్నులు, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తాను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో (Telangana) ఓపెన్ కాదని కూడా తెలిపారు. తాను కేవలం చట్టబద్ధమైన గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని, సంబంధిత కంపెనీతో చేసుకున్న ఒప్పందం వివరాలన్నీ ఈడీకి సమర్పించానని వెల్లడించారు. తన బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ కూడా ఈడీకి సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ విచారణతో విజయ్ దేవరకొండ తాను కేవలం లీగల్ గేమింగ్ యాప్‌కు మాత్రమే ప్రచారకర్తనని, ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకోలేదని స్పష్టం చేసినట్లయింది.
సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ (Kingdom Movie) విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను దక్కించుకోలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. భాగ్యశ్రీ బోర్సె (Bhagyashri Borse) కథానాయికగా నటించింది. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రూపొందనుంది.
విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. లైగర్ (Liger) డిజాస్టర్ తర్వాత చేసిన ఖుషి (Kushi) పర్వాలేదనిపించుకుంటే, ఫ్యామిలీ స్టార్ (Family Star) డిజాస్టర్ అయ్యింది. కింగ్డమ్ మూవీతో అయినా హిట్ కొడదామనుకుంటే తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెక్ట్స్ రౌడీ స్టార్ ఏం చేయబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
Also Read – Shubhman Gill: చేతినిండా సంపాదనతో పాతికేళ్ల క్రికెటర్..!


