విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రేపాయి. ఎంతగా అంటే ఏకంగా సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ వైసీపీ అభిమానులు ‘బాయ్‌కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ వివాదంపై మూవీ యూనిట్ ప్రెస్ మీట్ పెట్టింది. నిర్మాత సాహు గారపాటితో పాటు హీరో విశ్వక్సేన్ మీడియాతో మాట్లాడుతూ క్షమాపణలు చెప్పారు. సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా అని తెలిపారు. పృథ్వీ మాట్లాడిన విషయం తమకు తెలియదన్నారు.
సరిగ్గా అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారనే విషయం తెలియడంతో ఆయనని రిసీవ్ చేసుకునేందుకు బయటకి వెళ్లామన్నారు. తాము వచ్చేలోపు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. సరిగ్గా సినిమా రిలీజ్‌కి నాలుగు రోజుల ముందు ఇలా బాయ్‌కాట్ ట్రెండ్ చూసి షాక్ అయ్యామన్నారు. అది తమ నోటీస్‌లో జరగలేదని.. చాలా కష్టపడి సినిమా తీశామని పేర్కొన్నాడు. ఈ వివాదం ఇంతటితో ముగిద్దామని కోరారు. తమ ప్రమేయం లేని దానికి మిగిలిన వాళ్లను బలి చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు.