Saturday, February 22, 2025
Homeచిత్ర ప్రభYash: బంగారు బట్టల్లో రావణుడిగా యష్!షూటింగ్ స్టార్ట్

Yash: బంగారు బట్టల్లో రావణుడిగా యష్!షూటింగ్ స్టార్ట్

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న..

సాయిపల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్న రామాయణ సినిమాలో రావణుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్నారు. లేటెస్ట్ గా యష్ షూటింగ్ లో పాల్గొన్నారు. నితీష్ తివారీ డైరక్షన్ లో వస్తున్న రామాయణం సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు సాయి పల్లవి.

- Advertisement -

ప్రొడ్యూసర్ యష్

రామాయణంలో నటించటమే కాదు ఈ ప్యాన్ ఇండియా సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా యష్ తెరవెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. రామాయణ పార్ట్-1 ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజమైన బంగారంతో తయారు చేసిన స్పెషల్ కాస్ట్యూమ్స్ ను రావణుడి పాత్రధారి అయిన యష్ ధరిస్తుండటం విశేషం.

దీపావళికి రిలీజ్

దీపావళి 2026కి రామాయణ పార్ట్ 1 రిలీజ్ కానుండగా 2027 దీపావళి కానుకగా రామాయణ పార్ట్ 2 రిలీజ్ అయ్యేలా సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటోంది. లారా దత్తా, సన్నీ డియోల్, ఇందిరా క్రిష్ణా వంటివారు రామాయణ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News