Heroes – Villains: సాధారణంగా సినిమాల్లో విలన్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే హీరో క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అవుతుంది. అందుకే నేటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ కోసం దర్శకుడు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. హీరోలకు ధీటుగా విలన్ పాత్రల్ని క్రియేట్ చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్స్‌కు ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు. యాక్టింగ్ పరంగా భిన్న వేరియేషన్స్ చూపించే అవకాశం ఉండటంతో నెగెటివ్ క్యారెక్టర్స్‌లో కనిపించడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. పాన్ ఇండియన్ కల్చర్‌తో హీరోలు.. విలన్ పాత్రల్లో కనిపించే ట్రెండ్ ఎక్కువైంది. స్టార్స్ విలన్స్‌గా నటిస్తోన్న కొన్ని సినిమాలు ఏవంటే?
ఎన్టీఆర్ – వార్ 2
వార్ 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. స్టైలిష్ విలన్‌గా చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర సాగుతుందని చెబుతోన్నారు. ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో వార్ 2పై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. వార్ 2 మూవీ ఆగస్ట్ 14న థియేటర్లలోకి రాబోతుంది.
Also Read- Ramayanam Movie Budget: భారతీయ సినిమాలకు ఇంత బడ్జెట్టా…రిస్క్ తీసుకుంటున్నారా..?
నాగార్జున – కూలీ
టాలీవుడ్‌లో కథ, పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యమివ్వడంతో నాగార్జున ముందుంటారు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నాగార్జున విలన్‌గా అభిమానుల ముందుకు రాబోతున్నాడు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ మూవీలో నాగార్జున మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. మోస్ట్ వయలెంట్ విలన్‌గా నాగార్జున ఈ మూవీలో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. రా అండ్ రస్టిక్ పాత్రలో నాగార్జున యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుందని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అంటున్నాడు. విలన్ పాత్ర కోసం నాగార్జునను ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని ప్రమోషన్స్‌లో తెలిపాడు. వార్ 2కు పోటీగా ఈ మూవీ కూడా ఆగస్ట్ 14న విడుదలకాబోతుంది.
యశ్ – రామాయణ…
దాదాపు 4 వేల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న రామాయణ మూవీతో బాలీవుడ్‌లోకి విలన్‌గా అరంగేట్రం చేస్తున్నాడు యశ్. ఈ సినిమాలో రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఈ మైథాలజీ మూవీలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ కంటే యశ్ చేసిన రావణాసురుడి క్యారెక్టర్ పట్ల అభిమానుల్లో ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి కనిపించబోతున్నది.
కల్కి 2లో ఫుల్ లెంగ్త్ విలన్…
ప్రభాస్ బ్లాక్‌బస్టర్ మూవీ కల్కిలో కమల్‌హాసన్ విలన్‌గా నటించాడు. పార్ట్ వన్‌లో కమల్ పాత్ర చాలా తక్కువే కనిపించింది. సీక్వెల్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ విలన్‌గా కమల్ కనిపిస్తాడని అంటున్నారు.
పుష్ప, పుష్ప 2 సినిమాల్లో విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ అదరగొట్టాడు. భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో నవ్విస్తూనే తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టాడు. రణవీర్‌సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో విజయ్ దేవరకొండకు విలన్‌గా ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
Also Read- kiara advani: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఆడబిడ్డ జననం!


