యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ‘డిజే టిల్లు’ సిరీస్ సినిమాలతో ఒక్కసారిగా అభిమానుల్లో తన క్రేజ్ పెంచుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్’(Jack) మూవీ ఒకటి. SVCC బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది.
కాగా ఇటీవల న్యూఇయర్ సందర్భంగా సినిమాలో సిద్దు ఫస్ట్ లుక్ విడుదల చేసి మూవీపై క్యూరియాసిటీని పెంచారు. తాజాగా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వైష్ణవి చున్నీని అడ్డుగా పెట్టుకుని కాటుక కళ్లతో కుర్రకారును కట్టిపడేస్తుంది.