Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభHeroine Imanvi: కడుపుతో పాటు మనసు నిండిపోయింది.. ప్రభాస్ పై ఇమాన్వీ కామెంట్స్..

Heroine Imanvi: కడుపుతో పాటు మనసు నిండిపోయింది.. ప్రభాస్ పై ఇమాన్వీ కామెంట్స్..

Heroine Imanvi: ప్రభాస్ సినిమా అంటే ఆ యూనిట్ సభ్యులందరికీ పండగేనని చెప్పాలి. దీనికి ప్రత్యేకమైన కారణం ఆయన సినిమా షూటింగ్ గనక హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంటే ఖచ్చితంగా ఇంటినుంచి భోజనం వెళుతుంది. ప్రభాస్ రాజు ఇచ్చే విందు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మన సినీ తారలందరికీ ప్రభాస్ ఏదో ఒక సమయంలో తన ఇంటి నుంచి ఎంతో స్పెషల్ గా క్యారియర్ పంపిస్తుంటాడు.

- Advertisement -

ఇక, ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కి గానీ, దర్శకులకి..ఇతర యూనిట్ సభ్యులకి ఇలాంటి విందు ఎన్నోసార్లు ఇచ్చాడు. సలార్ సినిమా షూటింగ్ సమయంలో శ్రుతి హాసన్ కి ప్రభాస్ ఇంటినుంచి ప్రత్యేకంగా రుచికరమైన భోజనం తెప్పించాడు. ఆ సమయంలో శ్రుతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అయింది. మొన్న మధ్య నెల్లూరు దగ్గర షూటింగ్ జరుగుతున్న సమయంలో జగపతి బాబుకి ఇలాగే డార్లింగ్ తన టీమ్ తో భోజనం పంపించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Also Read – Mohanlal: ఆప‌రేష‌న్ సింధూర్ బ్యాక్‌డ్రాప్‌లో మోహ‌న్‌లాల్ మూవీ – బాయ్ కాట్ చేస్తామంటున్న నెటిజ‌న్లు

అంతేకాదు, కల్కీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె సహా ఇందులో నటించిన వారికి రాజుల వంటలు ఎలా ఉంటాయో చూపించాడు. అలాగే, ఇప్పుడు ప్రభాస్ సరసన నటిస్తున్న క్యూట్ హీరోయిన్ ఇమాన్వీ కూడా ప్రభాస్ తన ఇంటినుంచి భోజనం తెప్పించి రుచి చూపించాడు. ఈ భోజనం తిన్న ఇమాన్వీ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఇన్స్టా ఇన్‌ఫూయెన్సర్ ఇమాన్వీకి ప్రత్యేకంగా నాన్ వెజ్ భోజనం తెప్పించి రుచి చూపించాడు. ఈ భోజనం తిన్న తర్వాత “కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది” అంటూ ఇమాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అంతేకాదు, ఇందులో తన కోసం ప్రభాస్ తెప్పించిన వంటకాలను వీడియో తీసి పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Also Read – Tamannaah: మన శంకర వరప్రసాద్‌గారుతో తమన్నా స్పెషల్ నంబర్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad