Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభSreeleela : హీరోయిన్ శ్రీలీల ఏం చదువుతుందో తెలుసా..??

Sreeleela : హీరోయిన్ శ్రీలీల ఏం చదువుతుందో తెలుసా..??

- Advertisement -

Sreeleela : కన్నడ భామ శ్రీలీల పెళ్లి సందD సినిమాతో రాఘవేంద్రరావు చేతుల మీదుగా తెలుగు పరిశ్రమకి పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో శ్రీలీలకి పేరుతో పాటు ఆఫర్స్ కూడా బానే వచ్చాయి. ప్రస్తుతం ఈ కన్నడ భామకి తెలుగులోనే ఇప్పుడు దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన ధమాకా సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. ధమాకా సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు శ్రీలీల కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ధమాకా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల తన చదువు గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

శ్రీలీల మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం MBBS చదువుతున్నాను. MBBS చదువుకుంటూనే సినిమాలు చేస్తున్నాను. కెరీర్, స్టడీ రెండూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ విషయంలో మా అమ్మ నాకు బాగా సపోర్ట్ చాలా ఉంది. మా అమ్మ కూడా డాక్టర్. మా అమ్మ MBBS చదివి పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూడా PG చేసింది. ఇప్పుడు మా అమ్మ డాక్టర్ గా కూడా చేస్తుంది. ప్రస్తుతానికి నేనైతే MBBS చేస్తున్నాను. దీని తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచించుకోలేదు. చేతినిండా సినిమాలైతే ఉన్నాయి అని తెలిపింది. దీంతో శ్రీలీల కాబోయే డాక్టర్ అని తెలుసుకొని అంతా ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News