Tollywood Movies: హీరోయిన్స్ క్రేజ్..నటిగా కెరీర్ ఒకప్పుడున్నంతగా ఇప్పుడు లేదనే చెప్పాలి. ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్‌తో, పెర్ఫామెన్స్‌తో సీనియర్స్‌కు గట్టి పోటీ విసురుతున్నారు. ఈ పరిస్థితుల్లో హీరోయిన్స్‌కు ఎదురవుతున్న ప్రధాన సమస్య రీప్లేస్‌మెంట్. ఇప్పుడు హీరోయిన్ల విషయంలో కూడా సినిమాలు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతున్నాయి. గత కొంతకాలంగా ఈ తరహా మార్పులు, చేర్పులు చాలా కామన్ అయిపోయాయి. అంతా ఓకే అని అనుకున్న సినిమాలే కాదు, కొన్ని రోజులు షూటింగ్ కూడా జరుపుకున్న ప్రాజెక్టుల్లో కూడా హీరోయిన్లు మారిపోతుండటం ఇక్కడ కొసమెరుపు
హీరోయిన్స్ రీప్లేస్‌మెంట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ . అడవి శేష్ ‘డెకాయిట్’లో శృతి స్థానంలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వచ్చింది. డెకాయిట్ సినిమాను అడివిశేస్ (Adivi Sesh), శ్రుతీ హాసన్ హీరోహీరోయిన్లుగా స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్న సమయంలో శ్రుతి వర్కింగ్ స్టైల్ నచ్చని మేకర్స్ ఆమెను తప్పించి ఆ స్థానంలో మృణాల్‌ను తీసుకున్నారు. అప్పటి వరకు శ్రుతీ హాసన్ (Shruti Haasan) నటించిన సన్నివేశాలను రీషూట్ చేయాల్సి వచ్చింది.
Also Read – Pooja Hegde movies: ఆలస్యమైన అదిరిపోయే ఆఫర్.. టాలీవుడ్‌లో మళ్ళీ పూజా హెగ్డే సందడి!
పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పిరిట్ (Spirit) ఒకటి. సందీప్ వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందాల్సిన సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లటానికి సిద్ధమవుతోంది. ఇందులో ముందుగా దీపికా పదుకొనేను (Deepika Padukone) హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే పని గంటలు, ఇతరత్రా విషయాల్లో దీపిక పెట్టిన కండీషన్స్ నచ్చకపోవటంతో దీపిక స్థానంలో అనిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని (Tripti Dimri) తీసుకుని అందరికీ షాకిచ్చారు. తన టీమ్‌తో స్పిరిట్ స్టోరీని దీపిక లీక్ చేయిస్తుందంటూ సందీప్ సోషల్ మీడియాలో ఫైర్ కావటం తెలిసిందే. స్పిరిట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దీపికా పదుకొనె అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) చేతిలోని రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఇతర హీరోయిన్స్ చేతిలోకి వెళ్లిపోయాయి. అందులో ఒకటి నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. కానీ, ఆమె బాలీవుడ్‌లో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వలేకపోయారు. ఫలితంగా, ఈ ప్రాజెక్ట్ మీనాక్షి చౌదరి చేతికి వెళ్లింది. అలాగే ఆల్రెడీ టీజర్ రిలీజైన లెనిన్ మూవీ నుంచి కూడా శ్రీలీల తప్పుకోవటంతో ఆ ప్లేస్‌కి భాగ్యశ్రీ బోర్సె వచ్చి చేరింది. ఇలా ఒక హీరోయిన్ చేయాల్సిన సినిమా మరో హీరోయిన్ చేతికి వెళ్ళడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాకపోయినా, రీసెంట్ టైమ్స్‌లో మాత్రం దీని ఇన్సిడెంట్స్ భారీగా పెరిగాయని చెప్పొచ్చు. మరి బ్యూటీ డాల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మరి చూడాలి.
Also Read – Rajinikanth: నాగార్జున కంటే ముందు రజినీ విలన్‌గా నటించిన తెలుగు హీరో ఎవరో తెలుసా!


